యునైటెడ్ కింగ్‌డమ్‌లో నివసించాలనుకునే, చదువుకోవాలనుకునే మరియు పని చేయాలనుకునే వారికి ఒక సువర్ణావకాశం.
యుకె-ఇండియా యంగ్ ప్రొఫెషనల్స్ స్కీమ్ కోసం దరఖాస్తు ప్రక్రియ త్వరలో ప్రారంభమవుతుంది. ఈ పథకం యువ భారతీయులతో పాటు యుకె పౌరులు రెండు దేశాలలో చదువుకోవడానికి, పని చేయడానికి మరియు ప్రయాణించడానికి అవకాశాన్ని అందిస్తుంది.
దరఖాస్తుదారుల నుండి 3,000 మంది అర్హత గల అభ్యర్థులను యాదృచ్ఛికంగా ఎంపిక చేస్తారు. దీని కోసం, 18 నుండి 30 సంవత్సరాల వయస్సు గల భారతీయ పౌరులు JOV.UK వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలి. దీనికి దరఖాస్తుదారులు ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. YPS బ్యాలెట్ ఈ నెల 18న ప్రారంభమై 20న ముగుస్తుంది.