ఈ రోజుల్లో చాలామంది మంచి ఆదాయం కావాలనుకుంటున్నారు కానీ ఎలాంటి వ్యాపారం చేయాలో, ఎక్కడ నుంచి మొదలుపెట్టాలో తెలియక మదిలో సందేహాలతో ఉంటారు. అలాంటి వారి కోసమే ఇది ఒక మంచి అవకాశం. పట్టణమో, పల్లెనో అనే సంబంధం లేకుండా, కోళ్ళ పెంపకం (Poultry Farming) అనే వ్యాపారం మీరు చాలా తక్కువ పెట్టుబడితో మొదలుపెట్టి, మంచి స్థిర ఆదాయాన్ని పొందొచ్చు.
ఈ వ్యాపారాన్ని ప్రారంభించేందుకు పెద్ద స్థలాలు అవసరం లేదు. మీ ఇంటి వెనుక భాగంలో, తోటలో లేదా ఖాళీగా ఉన్న పొలాల్లో కూడా చిన్న స్థాయిలో మొదలు పెట్టవచ్చు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇది త్వరగా విస్తరిస్తోంది. ఇప్పటికే చాలా మంది రైతులు, యువత దీన్ని ఒక అదనపు ఆదాయ వనరుగా మలుచు కుంటున్నారు.
పెట్టుబడి మరియు ఆదాయం
మొదట మీరు రూ.40,000 – రూ.50,000 పెట్టుబడితో ప్రారంభించవచ్చు. ఈ పెట్టుబడిలో షెడ్ నిర్మాణం, కోడి పిల్లలు కొనుగోలు, ఫీడ్, ఔషధాలు వంటి ఖర్చులు వస్తాయి. మీరు 10 నుండి 15 దేశీ కోళ్లతో ప్రారంభించవచ్చు. దేశీ కోళ్లు సంవత్సరం పొడవునా 160 నుండి 180 గుడ్లు వేస్తాయి. కోడి మాంసం మరియు గుడ్లను స్థానిక మార్కెట్‌లో అమ్మడం ద్వారా మంచి ఆదాయం వస్తుంది.
Related News
బ్రెడ్స్ ఎంచుకోవడం ముఖ్యము
మీ లాభాలను గణనీయంగా పెంచాలంటే కడక్‌నాథ్, గ్రామప్రియ, స్వర్ణత్, వనరాజా, శ్రీనిధి వంటి మంచి జాతుల కోళ్లను పెంపకం చేయాలి. వీటికి మార్కెట్ డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. మాంసం కూడా పోషకవంతమైనదిగా ఉండటం వలన ధర ఎక్కువగా లభిస్తుంది.
ప్రభుత్వ మద్దతు
ఈ రంగానికి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి భారీ మద్దతు ఉంది. నేషనల్ లైవ్‌స్టాక్ మిషన్ కింద 50% వరకు సబ్సిడీ లభిస్తుంది. అలాగే నాబార్డ్ (NABARD) వంటి సంస్థలు కూడా రుణాలు అందిస్తున్నాయి. తక్కువ వడ్డీతో దీన్ని పొందగలరు. కొన్ని రాష్ట్రాల్లో ఉచిత శిక్షణా శిబిరాలు కూడా నిర్వహించబడుతున్నాయి.
లక్షల ఆదాయం ఎలా?
మీరు 50,000 పెట్టుబడితో ప్రారంభించి, గుడ్లు మరియు మాంసం విక్రయం ద్వారా సుమారు 1-1.5 లక్షల ఆదాయం కల్పించుకోవచ్చు. మీరు కోళ్ల సంఖ్యను నెలలకెల్లా పెంచుకుంటూ పోతే, ఈ వ్యాపారం వార్షికంగా లక్షల్లో ఆదాయం ఇస్తుంది. ఆర్ధిక స్వాతంత్ర్యం కోరేవారికి ఇది మంచి మార్గం.
ఈ వ్యాపారం చిన్న స్థాయి పెట్టుబడితో, ఎక్కువ స్థాయి లాభాలను అందించగలదు. ప్రభుత్వ సాయం ఉండటంతో, ఇది మరింత సురక్షితంగా మారింది. ఇప్పుడే మొదలు పెడితే భవిష్యత్తులో మీరు వ్యాపారవేత్తగా మారే అవకాశం ఉంటుంది. ఆలస్యం చేయకండి – మీ స్వంత పౌల్ట్రీ ఫార్మ్‌తో లక్షల ఆదాయం సంపాదించండి.