Telangana state లోని వివిధ government departments ల్లో ఖాళీగా ఉన్న 563 Group -1 సర్వీస్ పోస్టుల భర్తీకి ఈ ఏడాది February 19న notification విడుదలైన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 23 నుంచి మార్చి 16 వరకు Online దరఖాస్తులు స్వీకరిస్తారు. Group -1 ప్రిలిమినరీ పరీక్ష జూన్ 9న జరుగుతుంది. అయితే ఈ పరీక్షను Online లో నిర్వహిస్తారా లేదా Offline లో నిర్వహిస్తారా అనే దానిపై కమిషన్ ఇప్పటి వరకు స్పష్టత ఇవ్వలేదు. తాజాగా దీనిపై టీఎస్పీఎస్సీ క్లారిటీ ఇచ్చింది. ఓఎంఆర్ (Optical Mark Recognition ) పద్ధతిలో ప్రిలిమినరీ పరీక్షను June 9న నిర్వహించనున్నట్లు టీఎస్పీఎస్సీ సెక్రటరీ ఇ నవీన్ నికోలస్ ఒక ప్రకటనలో తెలిపారు. ఓఎంఆర్ లేదా సీబీఆర్టీలో ప్రిలిమినరీ పరీక్షను ఏదో ఒక పద్ధతిలో నిర్వహించే అవకాశం ఉందని, దీనిపై కమిషన్ తుది నిర్ణయం తీసుకుంటుందని తొలి Group 1notification లో కమిషన్ పేర్కొన్న సంగతి తెలిసిందే.
కానీ ఈసారి Group -1కి దాదాపు 4.03 లక్షల దరఖాస్తులు రావడంతో సీబీఆర్టీ పద్ధతిలో పరీక్ష నిర్వహిస్తే సాంకేతిక ఇబ్బందులు తలెత్తుతాయని కమిషన్ భావించింది. అందుకే ప్రిలిమినరీ పరీక్షను ఓఎంఆర్ విధానంలో నిర్వహిస్తామని కమిషన్ వెల్లడించింది. Group 1 ప్రిలిమ్స్లో నిర్దేశిత కటాఫ్ సాధించిన వారందరికీ October 21 నుంచి mains పరీక్ష నిర్వహించనున్నట్లు కమిషన్ ఇప్పటికే ప్రకటించింది.
మరోవైపు వరుస పేపర్ లీకేజీల కారణంగా గత ప్రభుత్వం ఇచ్చిన Group 1 notification ను రద్దు చేయడంతో కాంగ్రెస్ రాష్ట్రంలో పోస్టుల సంఖ్యను పెంచి మొత్తం 503 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు గరిష్ట వయోపరిమితిని 46 ఏళ్లుగా జియో విడుదల చేసింది. కొన్ని పోస్టులకు 35 ఏళ్ల వరకు మాత్రమే సడలింపు ఇచ్చారు.