TS EAMCET: ముగిసిన తొలి విడత ఇంజినీరింగ్ సీట్ల కేటాయింపు.. అలాట్‌మెంట్ ఆర్డర్ విడుదల

TELANGANA EAMCET 2024 మొదటి బ్యాచ్ ఇంజనీరింగ్ సీట్ల కేటాయింపు ముగిసింది. ఈ మేరకు శుక్రవారం రాత్రి ఉన్నత విద్యాశాఖ అధికారులు కేటాయింపు ఉత్తర్వులు విడుదల చేశారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

రాష్ట్రవ్యాప్తంగా వెబ్ ఆప్షన్లు ఇచ్చిన 95,383 మంది విద్యార్థులకు సంబంధించి మొదటి దశలో 70,665 ఇంజినీరింగ్ సీట్లను కేటాయించారు.

ఈ కేటాయింపులతో 14.52 శాతం చొప్పున 12,001 సీట్లు భర్తీ కాలేదు. సీటు పొందిన విద్యార్థులు ఈ నెల 22లోగా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని ఎంసెట్ కన్వీనర్ సూచించారు.

కోర్సుల వారీగా చూస్తే CSE లో 94.20 శాతం, EEE లో 58.38 శాతం, CIVIL ల్‌లో 44.76 శాతం, MECHANICAL లో 38.50 శాతం సీట్లు భర్తీ అయ్యాయి.

3 యూనివర్సిటీలు, 28 ప్రైవేట్ కాలేజీల్లో ఇంజినీరింగ్ సీట్లు నిండిపోయాయని అధికారులు వెల్లడించారు.

అలాట్‌మెంట్ ఆర్డర్ కోసం విద్యార్థులు https://tseapcet.nic.in/ వెబ్‌సైట్‌ను సందర్శించాలని అధికారులు తెలిపారు.

Click here for your seat allotment orders: TGEAPCET