Chicken biryani: ఇంట్లో హోటల్ టేస్ట్ రావాలంటే ఈ బిర్యానీ సీక్రెట్ తప్పక తెలుసుకోండి… ఈసారే ప్లాన్ చేయండి…

చికెన్ బిర్యానీ అంటేనే నోట్లో నీళ్లు ఊరే డిష్. హైదరాబాదీ స్టైల్లో తయారు చేసిన చికెన్ బిర్యానీ రుచి ఎప్పటికీ మర్చిపోలేం. అయితే ప్రతి సారి హోటల్‌కి వెళ్లడం సాధ్యం కాదు కాబట్టి, ఇంట్లోనే అలాంటి టేస్ట్ రావాలంటే కొన్ని చిన్న టిప్స్ పాటిస్తే చాలు. ఈ టిప్స్ ఫాలో అయితే, ఇంటి వాళ్లు మాత్రమే కాదు, గెస్టులు కూడా మీరు చేసిన బిర్యానీకి ఫిదా అవుతారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

ముందుగా మంచి ఫ్రెష్ చికెన్ తీసుకోవాలి. పెద్ద లెగ్ పీసులైతే మరీ బాగుంటుంది. ముక్కలు చిన్నగా చేయకండి. ఇప్పుడు ఆ చికెన్‌ను 2-3 సార్లు బాగా కడగాలి. తర్వాత అందులో కారం, ఉప్పు, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, బిర్యానీ మసాలా వేసి కలపాలి. తర్వాత అందులో పెరుగు, పసుపు, నిమ్మరసం, పచ్చిమిర్చి, కొత్తిమీర, వేయించిన ఉల్లిపాయలు కూడా వేసి బాగా కలిపి ఒక గంట పాటు మెరినేట్ చేయాలి. ఇది బిర్యానీ టేస్ట్‌కి సోల్ సీక్రెట్.

ఇదే టైంలో బాస్మతీ రైస్‌ను బాగా కడిగి, ఓ పెద్ద గిన్నెలో వండాలి. కానీ పూర్తిగా కాదు, కేవలం 70 శాతం మాత్రమే ఉడకాలి. ఇప్పుడు మరొక గిన్నెను స్టవ్ మీద పెట్టి నెయ్యి, ఆయిల్ వేసుకోవాలి. అందులో దాల్చిన చెక్క, లవంగం, యాలకులు, బిర్యానీ పువ్వు, మిరియాలు, జీలకర్ర, మరాటీ మొగ్గ, బిర్యానీ ఆకులు వంటి మసాలాలను వేయాలి. ఈ మసాలా వేడెక్కిన తర్వాత మ్యారినేట్ చేసిన చికెన్‌ను వేసి కాసేపు ఉడకనివ్వాలి.

చికెన్ కాస్త సాఫ్ట్ గా అయ్యే టైంలో, ముందుగా వేసి 70 శాతం ఉడికిన అన్నాన్ని పై నుంచి అద్దాలి. కాసింత నీళ్లు వేసి బిర్యానీని డమ్‌కి పెట్టాలి. ఇది మిక్కిలి కీలకం. చాలా మంది ముక్క ఇంకా ఉడకకముందే అన్నం వేసేస్తారు. అప్పుడు బిర్యానీ తేలిపోతుంది. కనుక ముక్క కొంచెం గట్టిగా ఉండేంతవరకు స్టవ్ మీద ఉంచి, తరువాతే అన్నం అద్దాలి. ఇలా దమ్‌కు పెట్టిన బిర్యానీని 20 నిమిషాలు స్లో ఫ్లేమ్‌లో ఉంచితే, అన్నం ఫ్లఫీగా, మసాలా బాగానే మిక్స్‌ అవుతుంది.

ఇలాంటి చిట్కాలతో తయారైన బిర్యానీ టేస్ట్ చూస్తే ఇక హోటల్‌కి వెళ్లాలనిపించదు. టిఫిన్ టైం అయినా, స్పెషల్ లంచ్ అయినా, ఫ్రెండ్స్ పార్టీ అయినా.. మీ ఇంట్లో తయారైన బిర్యానీనే హైలైట్ అవుతుంది. ఒకసారి ఈ టిప్స్ ఫాలో అయితే, మీరూ చెబుతారు – రెస్టారెంట్ టేస్ట్ ఇంట్లోనే వచ్చేసింది!