Dry Fruits Laddu: చక్కెర లేకున్నా కమ్మగా తీయగా… పిల్లలు, పెద్దలెవ్వరైనా లాగిచేసే లడ్డూలు…

ఇంట్లో పిల్లలు డ్రై ఫ్రూట్స్ తినమని చెప్పినా, ముఖం మాడేస్తారు. కానీ ఆరోగ్యానికి ఇవి ఎంతో మేలు చేస్తాయన్న సంగతి అందరికీ తెలుసు. పిల్లలకు నచ్చేలా డ్రై ఫ్రూట్స్ ఇవ్వాలంటే వాటిని స్నాక్ లా లేదా స్వీట్ లా తయారుచేస్తే చాలా ఈజీగా తింటారు. అలాంటి రుచికరమైన, హెల్దీ డ్రై ఫ్రూట్ లడ్డూ ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

ఈ లడ్డూలు తయారీలో చక్కెర లేకుండా కూడా తీపి టేస్ట్ బాగానే వస్తుంది. అందుకే పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఇలా తయారుచేస్తే చాలా మంచిది. మొట్టమొదటగా బాదంపప్పు, జీడిపప్పు, పిస్తా, కిస్‌మిస్ వంటి డ్రై ఫ్రూట్స్‌ను చిన్న ముక్కలుగా కోసుకోవాలి. స్టౌ మీద కడాయి పెట్టి నెయ్యి వేడి చేసి మొదట బాదంపప్పు వేయించాలి. తర్వాత మిగతా డ్రై ఫ్రూట్స్‌ను కలిపి కొద్దిసేపు వేయించాలి. తర్వాత గుమ్మడి గింజలు, పుచ్చగింజలు, కొబ్బరి తురుము, గసగసాలు వేసి మరికొంత వేయించి ప్లేట్‌లోకి తీసుకోవాలి.

ఇక డేట్ ఫ్రూట్స్ (ఖర్జూరం) నుంచి గింజలు తీయాలి. వాటిని మిక్సీలో వేసి మెత్తగా చేయాలి. స్టౌ మీద కొంచెం నెయ్యి వేసి ఈ డేట్ పేస్ట్‌ను కలిపి రెండు నిమిషాలు వేయించాలి. ఇప్పుడు ముందుగా వేసుకున్న డ్రై ఫ్రూట్స్ కలిపి, యాలకుల పొడి కూడా వేసి బాగా కలపాలి. పిండి లాగా అవుతుంది. కొద్దిగా చల్లారిన తర్వాత చేతికి నెయ్యి వేసుకుని చిన్న చిన్న లడ్డూలుగా తయారుచేయాలి.

ఇలా ప్రిపేర్ చేసిన డ్రై ఫ్రూట్ లడ్డూలు 10 రోజుల వరకు ఫ్రెష్‌గా నిల్వ ఉంటాయి. ఎలాంటి కృత్రిమ మిఠాయి లేకుండా పిల్లలు, పెద్దలు ఎవరైనా తీయగా తింటారు. అందులోనూ ఇలాంటి హెల్దీ లడ్డూలు ఇంట్లో తయారుచేయడం చాలా సింపుల్‌.

ఇప్పుడే ట్రై చేయండి – ఒకసారి చేస్తే మళ్లీ బయట స్వీట్లు కొనాలనిపించదు!