ఆక్టోపస్ ఆమె దగ్గరికి వచ్చి ఆమె చేయి పట్టుకుని తనతో రమ్మని కోరింది. అప్పుడు తాను కూడా ఆక్టోపస్‌తో నడవడం ప్రారంభించానని చెప్పింది. అంతేకాదు.. ఆక్టోపస్ నేనూ తనతో పాటు నడుస్తున్నానో లేదో అని వెనక్కి తిరిగి చూసింది.. నేను తనని ఫాలో అవుతున్నానని నిర్ధారించుకున్న తర్వాత మళ్లీ ముందుకు సాగడం ప్రారంభించింది. ఆక్టోపస్‌ను సముద్రం దిగువకు తీసుకెళ్లి రెండు ఉక్కు స్తంభాల మధ్య కట్టారు
సముద్రపు లోతుల్లో ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. వాటి గురించి మనుషులకు కూడా తెలియదు. అలాగే వందల ఏళ్ల క్రితం నిధితో నిండిన ఓడలు నీటిలో మునిగిపోయాయని, వాటి జాడలు ఇంకా దొరకలేదని ఎన్నో చారిత్రక కథనాలు వింటుంటాం. అయితే, కొన్నిసార్లు ఈ నిధులు తెలిసినప్పటికీ వాటిని గుర్తించడం కష్టం. ఇక్కడ ఓ మహిళా డైవర్‌కి కూడా అలాంటిదే జరిగింది. ఆమె మరో పని మీద సముద్రంలోకి వెళ్లింది. కానీ ఆమెకు తెలియకుండానే ఆమెకు ఒక నిధి దొరికింది. అయితే, ఇక్కడ అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఆక్టోపస్ అనే వింత సముద్ర జీవి ఆమెకు నిధిని చూపించింది. వివరాల్లోకి వెళితే..
ఆస్ట్రేలియా నివాసి జూల్స్ కేసీ సముద్రంలో డై-వింగ్ కోసం వెళ్ళింది. ఆమె తెలివైన ఆక్టోపస్‌ని చూసింది. అది ఆమె చేతిని పట్టుకుని సముద్రం కింద దాగి ఉన్న నిధి వైపు నడిపించింది. అది చూసి జూల్స్ ఆశ్చర్యపోయింది. ఆక్టోపస్ పదే పదే ఆమె చేతిని పట్టుకుని నీటి అడుగున తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తోందని జూల్స్ నమ్మలేకపోయింది. అయితే, ఓ అవార్డ్ విన్నింగ్ ఫోటోగ్రాఫర్ ఆక్టోపస్ ఆమెను చేతితో మోసుకెళ్తున్న అద్భుతమైన దృశ్యాన్ని బంధించాడు. ఈ దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.