ఏపీలో ఉద్యోగులు ఎదురుచూస్తున్న బదిలీల ప్రక్రియకు సంకీర్ణ ప్రభుత్వం తాజాగా తెరతీసింది. ఈ మేరకు సాధారణ బదిలీలపై ఉన్న నిషేధాన్ని సడలిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి అనుగుణంగా రాష్ట్ర గ్రామ, వార్డు సచివాలయాలు కూడా మార్గదర్శకాలు జారీ చేశాయి.
రాష్ట్రంలోని గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల బదిలీల ప్రక్రియను ఎలా చేపట్టాలో వివరించింది.
రాష్ట్రంలో ఈ నెల 19 నుంచి 31వ తేదీ వరకు సాధారణ బదిలీలపై ఉన్న నిషేధాన్ని ప్రభుత్వం సడలించింది.
దీని ప్రకారం గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు బదిలీ కావాలనుకునే వారు అధికారిక వెబ్‌సైట్‌లో లాగిన్‌కి వెళ్లి దరఖాస్తు చేసుకోవాలి. లాగిన్ అయిన తర్వాత, అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయాలి. అలాగే ఉమ్మడి జిల్లాల కలెక్టర్ల ఖాళీల జాబితాను సచివాలయాల వెబ్‌సైట్‌లో వారికి అందుబాటులో ఉంచాలి.
ఈ విధంగా గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు ఆన్ లైన్ లో చేసుకున్న దరఖాస్తులను కలెక్టర్లు డౌన్ లోడ్ చేసుకుని పరిశీలించాలి. వాటిని ప్రాధాన్యతా వర్గాలుగా విభజించాలి. కౌన్సెలింగ్‌కు ముందు సీనియారిటీ, మెరిట్ ఆధారంగా దరఖాస్తులను క్రమబద్ధీకరించాలి. ఆగస్టు 31లోగా ప్రభుత్వం ఇచ్చిన ఎస్‌ఓపీ ఆధారంగా కౌన్సెలింగ్ ద్వారా బదిలీ ప్రక్రియ చేపట్టాలి.
పరిపాలనాపరమైన కారణాలు ఉంటే ఏ ఉద్యోగినైనా బలవంతంగా బదిలీ చేసే అధికారం కూడా కలెక్టర్లకు ఉంటుంది. అలాగే ఏసీబీ, విజిలెన్స్ కేసులున్న ఉద్యోగుల బదిలీలు చేపట్టకూడదు. బదిలీ చేయబడిన ఏ ఉద్యోగికి TTA కానీ మరేదైనా ప్రయోజనం ఉండదు. ఏ ఉద్యోగిని అతని స్వగ్రామం లేదా వార్డులో నియమించకూడదు. ఐటీడీఏయేతర ప్రాంతాలతో పోలిస్తే ఐటీడీఏ ప్రాంతాలకు బదిలీల్లో ప్రాధాన్యం ఇవ్వాలి. ఐటీడీఏ పరిధిలో బదిలీ అయిన ఉద్యోగుల వయస్సు 50 ఏళ్లలోపు ఉండేలా చూడాలి.
Download GSW staff Transfer Guidelines copy
GSWS Employees Transfers Schedule
- Last date to apply online: 27-08-2024
- Last date for category wise arrangement of applications for seniority access: 28-08-2024
- Date of counseling and issuance of transfer proceedings : 29-08-2024 & 30-08-2024
- Registration of applications on transfers: 30-08-2024 Onwards
Transfers official Website for login: https://gramawardsachivalayam.ap.gov.in/GSWSLMS/Login
GVWV-transfers-instruction 2024 teacher info