అమరావతి: ఈ రోజు (16.08.2025) జరిగిన ఉపాయధ్యాయ సంఘాల సమావేశంలో పాఠశాల కమిషనర్ తో ఏకిభావించని సంఘ నాయకులు. సమావేశాన్ని బహిష్కరించి బయటికి వచ్చారు.. ప్రభుత్వ ఒంటెద్దు పోకడలు ఇంకా సాగనివ్వమని.. ఉపాధ్యాయుల మరియు సంఘాల సంక్షేమం కొరకు కొన్ని సూచనలు చేసినా పట్టించుకోలేదని.. సమావేశాన్ని బహిష్కరించారు..
ఈ కింది విధం గా ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు…
ప్రభుత్వం విద్యా సంస్కరణలలో భాగంగా ప్రతి వారం ఉపాధ్యాయ సంఘాలతో చర్చించడం జరుగుతుంది. అయితే, ప్రభుత్వ ప్రతిపాదనలపై ఉపాధ్యాయ సంఘాలు భిన్నాభిప్రాయం వ్యక్తం చేసిన అంశాలపై సమీక్ష చేయకుండా ఉత్తర్వులు ఇచ్చేసిన పరిస్థితి. అంతేకాకుండా ఉపాధ్యాయ సంఘాల ఏకాభిప్రాయం ప్రకారమే విద్యారంగంలో సంస్కరణలు చేశామని అధికారులు, ప్రభుత్వ ప్రతినిధులు వ్యాఖ్యానించడాన్ని ఖండిస్తున్నాం. అన్ని సంఘాలు వ్యతిరేకించే అంశాలు, తప్పనిసరిగా మార్చవలసిన అంశాలను మీ ముందు ఉంచుతున్నాము.
Demands:
- ఉన్నత పాఠశాలల్లో 1:30 నిష్పత్తి ప్రకారం అనగా 45 మంది విద్యార్థులు దాటిన తరువాత
- రెండవ సెక్షన్ ను ఏర్పాటు చేయాలని, ఆ తరువాత ప్రతి 40 మంది కి మరో సెక్షన్ ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. మోడల్ ప్రాధమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులుగా స్కూల్ అసిస్టెంట్ లను నియమించడం అశాస్త్రీయమైనది.
- సమాంతర మీడియం మరియు మైనర్ మీడియం ల ను కొనసాగించి స్టాఫ్ పాటర్న్ ను కొనసాగించాలి.
- స్టడీ లీవ్ లో ఉన్న వారి స్థానాలను ఖాళీగా చూపరాదు. రెండు నెలలలోనే వారు తిరిగి వస్తున్నందున వారికి మినహాయింపు ఇవ్వాలి.
- ఫౌండేషన్ మరియు బేసిక్ ప్రాధమిక పాఠశాలల్లో 41వద్ద 3వ పోస్టు ఇవ్వాలి.
- ఏప్రిల్ 23వ తేదీ రోల్ను పరిగణనలోకి తీసుకోవాలి.
- పి.హెచ్ కోటాలో ప్రిఫరెన్షియల్ కేటగిరీ వారికి ప్రాధమిక పాఠశాలలో 40% శాతం, ఉన్నత పాఠశాలలో 50% ఖాళీలను మాత్రమే ఎంపిక చేసుకోవాలనే నిబంధన ఉన్నది. డిపెండెంట్ ద్వారా ప్రిఫరెన్షియల్ కేటగిరీ కిందకు వచ్చిన వారికి ఈ నిబంధన అవసరం లేదు. పిహెచ్ వారి కేసు కోర్టులో ఉన్నందున ఈ నిబంధనను తొలగించాలి. “
- ఒక్క పోస్టును కూడా బ్లాక్ చేయమని హామీ ఇచ్చి మార్గదర్శకాలలో పోస్టులను బ్లాక్ చేస్తుండడం సరైనది కాదు.
- మోడల్ ప్రైమరీ స్కూల్ నకు సెకండరీ గ్రేడ్ టీచర్ల కు ప్రమోషన్లు ఇచ్చి ప్రధానోపాధ్యాయులను నియమించాలి.
- ఫౌండేషన్ ప్రాథమిక పాఠశాలల్లో 1:20 నిష్పత్తి అమలు చేయాలి.
- 2023 లో రేషనలైజేషన్ కాబడి మరియు 2023 లో ప్రమోషన్ పొంది 2025లో రేషనలైజేషన్ అవుతున్న వారికి బదిలీలలో అన్యాయం జరుగుతుంది. (సదరు రేషనలైజేషన్ గానీ సదరు ప్రమోషన్ గానీ జీవో 117 ఫలితమే), ఈ విషయమై ఇప్పటికే పలుదఫాలు ప్రాతినిధ్యం చేసి ఉన్నా ఫలితం రాలేదు. వీరికి రేషనలైజేషన్లో 8 సంవత్సరాల పాయింట్లు కేటాయించాలి.
- పి. హెచ్్కటా వారిని యధాస్థితిలో ఉంచమని కోర్టు ఉత్తర్వులు ఇచ్చినందున వారు రేషనలైజేషన్లో ఉన్నప్పుడు వేరే వారిని రేషనలైజేషన్ చేయడం సరికాదు.
- ప్రభుత్వ, పంచాయితీ రాజ్ సర్వీస్ రూల్స్ సమస్య తేలకుండా 8 సంవత్సరాల లాంగ్ స్టాండింగ్ అయిన వారిని స్వంత యాజమాన్యానికి వెళ్ళమనడం అపాలి.
- రేషనలైజేషన్లో సీనియర్ విల్లింగ్ ఇస్తే పాతస్టేషన్ పాయింట్లు ఇవ్వాలి.
- సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులకు ఆన్లైన్లో కూడిన మాన్యువల్ కౌన్సిలింగ్ను ఏర్పాటు చేయాలి.
- నూతన విధానం అమలు అవుతున్నందున మూడు సంవత్సరాల పాటు రేషనలైజేషన్ ప్రక్రియ లేకుండా చూడాలి.
- MEOలకు బదిలీలు జరపాలి. కోరుకొన్న MEO- 1,MEO-2లకు హెచ్.ఎం కన్వర్షన్ ఇవ్వాలి మెరుగైన విద్యా రంగం కోసం అధికారులకు ప్రభుత్వానికి మా సహకారం అందించడం జరిగింది.
ఇదే క్రమంలో మా అభిప్రాయాలను ఖాతరు చేయకుండా ఏకపక్షంగా నిర్ణయాలు చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. మేము ప్రతిపాదించిన డిమాండ్ల పై తక్షణం చర్చించి అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం.
ఉపాధ్యాయ సంఘాలు ప్రతిపాదించిన పై డిమాండ్లపై చర్చించేందుకు అంగీకరించాలని, లేనిచో ఉపాధ్యాయ సంఘాలన్నీ మూకుమ్మడిగా బహిష్కరించి ఉద్యమ కార్యాచరణ అమలు చేస్తామని తెలియజేస్తున్నాం.
Teacher Union JAC note Downlaod