ట్రాయ్ ఆదేశాలు.. అలాంటి యూజర్లకు జియో సరికొత్త ప్లాన్స్!

టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) కొన్ని రోజుల క్రితం ప్రత్యేకంగా కాలింగ్, SMS కోసం మాత్రమే రీఛార్జ్ ప్లాన్‌లను అందించాలని ఆదేశించింది. దీనితో జియో రెండు ప్లాన్‌లను ప్రవేశపెట్టింది. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. జియో ప్రవేశపెట్టిన కొత్త ప్లాన్‌ల జాబితాలో 84-రోజుల ప్లాన్, 365-రోజుల ప్లాన్ ఉన్నాయి. ఈ రీఛార్జ్‌లతో వినియోగదారుడు వాయిస్ కాల్స్, SMS మాత్రమే చేయగలర. కానీ, డేటా అందుబాటులో లేదు. కీ ప్యాడ్ మొబైల్స్ లేదా డేటా అవసరం లేని మొబైల్స్ ఉపయోగించే వారికి ఇవి మంచి ఎంపిక అని చెప్పవచ్చు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

రూ. 458 రీఛార్జ్ ప్లాన్

జియో వినియోగదారులు రూ. 458తో రీఛార్జ్ చేస్తే, వారికి 84 రోజుల చెల్లుబాటు లభిస్తుంది. ఈ ప్లాన్‌లో, వినియోగదారులు అపరిమిత కాలింగ్, 1000 ఉచిత SMS పొందుతారు. దీనితో పాటు.. వినియోగదారులు జియో సినిమా, జియో టీవీ వంటి యాప్‌లను కూడా ఉచితంగా యాక్సెస్ చేయవచ్చు.

Related News

 

రూ.1,958 రీఛార్జ్ ప్లాన్

జియో అందించే మరో ప్లాన్ ధర రూ. 1,958. ఈ రీఛార్జ్ ప్లాన్ 365 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. మీరు ఈ ప్లాన్‌ను రీఛార్జ్ చేస్తే మీకు అపరిమిత కాలింగ్ మాత్రమే కాకుండా 3,600 ఉచిత SMS కూడా లభిస్తుంది. మీరు జియో సినిమా, జియో టీవీ వంటి యాప్‌లను కూడా ఉచితంగా యాక్సెస్ చేయవచ్చు.

జియో రెండు ప్లాన్‌లను తొలగించింది
జియో ఇప్పుడు దాని జాబితా నుండి రెండు పాత రీఛార్జ్ ప్లాన్‌లను తొలగించింది. అవి రూ. 479 ప్లాన్, రూ. 1899 ప్లాన్. రూ. 1899ప్లాన్ 336 రోజుల చెల్లుబాటుతో 24 GB డేటాను అందించగా, రూ. 479 ప్లాన్ 84 రోజుల  చెల్లుబాటుతో 6 GB డేటాను అందించింది. ఈ రెండూ ఇప్పుడు అందుబాటులో లేవని తెలుస్తోంది.