రోడ్లు సరిగా లేని ప్రాంతాల్లో టోల్ చార్జీలు వసూలు చేయవద్దని రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఆయా ఏజెన్సీలకు సూచించారు.
గుంతలమయమైన రోడ్లు, toll plazas ల వద్ద రద్దీ ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని అన్నారు. satellite-based toll వసూలుపై జరిగిన గ్లోబల్ వర్క్‌షాప్‌లో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
ప్రజలు తిట్టుకుంటున్నారు..
Related News
‘మీ సేవలు ఉత్తమంగా లేనప్పుడు టోల్ వసూలు చేయవద్దు. రోడ్లు సరిగా లేకుంటే ప్రజలు సంతోషించరు. ఇప్పటికే చాలా మంది సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో పోస్ట్ చేస్తున్నారు. కాబట్టి మంచి రోడ్లు నిర్మించలేనప్పుడు టోల్ వసూలు చేయడం సరికాదు. గుంతలు పడిన రోడ్లపై టోల్ వసూలు చేస్తే రాజకీయ నాయకులుగా ప్రజల ఆగ్రహానికి గురవుతాం. toll plazas of the National Highway వద్ద జాప్యం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.
రూ.10 వేల కోట్ల అదనపు ఆదాయం..
కాగా, ఈ ఆర్థిక సంవత్సరంలోనే satellite-based toll collection system విధానాన్ని ప్రారంభిస్తామని గడ్కరీ స్పష్టం చేశారు. మొదటి దశలో, 5,000 కిలోమీటర్ల రోడ్లపై ఈ టోల్ విధానాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు మరియు ముందుగా వాణిజ్య వాహనాలను ఒక లేన్‌లో అనుమతిస్తారు. టోల్ వసూలుకు కీలకమైన వెహికల్ ట్రాకర్ సిస్టమ్ యూనిట్‌ను సంబంధిత వాహనాల్లో అమర్చాలి. ఈ వ్యవస్థ అందుబాటులోకి వస్తే టోల్ ప్లాజాల వద్ద వాహనాలు ఆగాల్సిన అవసరం ఉండదు. దశలవారీగా ఈ విధానాన్ని అమలు చేస్తాం. దీనివల్ల ప్రభుత్వానికి రూ.10 వేల కోట్ల అదనపు ఆదాయం సమకూరనుంది.