నేడు (జూలై 1న) ఏపీటెట్ కొత్త నోటిఫికేషన్ విడుదల
- జూలై 2 నుండి దరఖాస్తుల స్వీకరణ.
- పాఠశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీ ఎస్. సురేష్ కుమార్ గారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం MEGA DSC నిర్వహించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో అభ్యర్థుల విజ్ఞప్తుల మేరకు మరోసారి TET నిర్వహించాలని నిర్ణయించింది. ఈ సందర్భంగా AP TET కొత్త నోటిఫికేషన్ జూలై1న విడుదల చేయనున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీ ఎస్.సురేష్ కుమార్ గారు ఒక ప్రకటనలో తెలిపారు.
AP TET (JULY)-2024 ఆన్లైన్ పరీక్షలకు సంబంధిన పూర్తి సమాచారం అనగా షెడ్యూల్, నోటిఫికెషన్స్, ఇన్ఫర్మేషన్ బులెటిన్, సిలబస్, ఆన్లైన్ విధానంలో (CBT) జరుగు పరీక్షలు గురించి అభ్యర్థులకు తగిన సూచనలు, విధివిధానాలు అన్నీ https://cse.ap.gov.in/ వెబ్ సైట్ నందు ఉంచబడినవి. అభ్యర్థులు పూర్తి సమాచారం కోసం తేదీ.02.07.2024 నుండి పైన తెలిపిన వెబ్సైటు నుండి డౌన్లోడ్ చేసుకోగలరని తెలిపారు. సహాయ సమాచారం కోసం కమిషనర్ అఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఆఫీస్ నందు ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ ను సంప్రదించాలని కోరారు.
Related News
APTET OFFICIAL WEBPORTAL: AP TET (apcfss.in)
ఎస్.సురేష్ కుమార్
కమీషనర్, పాఠశాల విద్య, ఏపి.