ఇన్‌కమ్ ట్యాక్స్ అప్డేట్ గడువు దగ్గరపడుతోంది! మీరు మీ పాత ట్యాక్స్ రిటర్న్‌లో తప్పులు సరిదిద్దుకోవడానికి ఇంకా అవకాశం ఉంది. అయితే, మార్చి 31, 2025 లోపల అప్డేట్ చేయకపోతే కఠినమైన పరిణామాలు ఎదురవుతాయి!
అప్డేటెడ్ రిటర్న్ అంటే ఏమిటి?
2022లో కేంద్ర ప్రభుత్వం కొత్తగా Updated Return ఆప్షన్ ప్రవేశపెట్టింది. దీని ద్వారా గత రెండు సంవత్సరాల్లో (FY 2021-22 & FY 2022-23) ఫైల్ చేసిన రిటర్న్‌లో పొరపాట్లు సరిచేసుకోవచ్చు లేదా మిస్సైన ఆదాయాన్ని జోడించుకోవచ్చు. కానీ, దీని కోసం అదనపు పన్ను (Penalty Tax) చెల్లించాల్సి ఉంటుంది.
గడువు దాటితే ఏమవుతాయి?
1. ఐటీ డిపార్ట్మెంట్ విచారణలో పడతారు
Related News
- మీ బ్యాంక్ లావాదేవీలు, UPI ట్రాన్సాక్షన్లు, రియల్ ఎస్టేట్ & స్టాక్ మార్కెట్ డేటాను ఐటీ డిపార్ట్మెంట్ ట్రాక్ చేస్తుంది.
- అకౌంట్ స్క్రూటినీ అయ్యే అవకాశం ఉంటుంది.
2. పెద్ద మొత్తంలో జరిమానాలు & వడ్డీ
- లేటుగా ఫైల్ చేస్తే ₹5,000/- వరకు లేట్ ఫైల్ జరిమానా వేయబడుతుంది.
- చెల్లించని ట్యాక్స్‌పై ప్రతి నెలకు 1% వడ్డీ (Interest) కూడా పడుతుంది.
3. అదనపు పన్ను (Penalty Tax)
- గడువు దాటితే మీరు ఐటీ డిపార్ట్మెంట్ విచారణలో పడకుండా ఉండటానికి ఇకపై 25% – 50% అదనపు పన్ను చెల్లించాల్సి ఉంటుంది!
4. లీగల్ నోటీసులు & కోర్టు కేసులు
- నిర్దేశిత సమయానికి ట్యాక్స్ ఫైల్ చేయకపోతే సీబీఐ విచారణ, కోర్టు నోటీసులు, ఆస్తులు సీజ్ చేసే ప్రమాదం కూడా ఉంటుంది!
5. ట్యాక్స్ రిఫండ్ లాభం పోతుంది
- మీరు ఎక్కువగా ట్యాక్స్ చెల్లించి ఉంటే కూడా రిఫండ్ పొందే అవకాశం కోల్పోతారు.
ఎవరు అప్డేటెడ్ రిటర్న్ ఫైల్ చేయలేరు?
- మీరు ఇప్పటికే IT రిఫండ్ క్లెయిమ్ చేసి ఉంటే & ఇప్పుడు ఎక్కువ రిఫండ్ కోసం అప్డేట్ చేస్తే.
- ఐటీ డిపార్ట్మెంట్ ఇప్పటికే మీపై సోదాలు, విచారణ ప్రారంభించి ఉంటే.
- మీరు మునుపటి ITR లో లాస్ చూపించి ఉంటే, అప్డేటెడ్ రిటర్న్ ద్వారా లాభం చూపించలేరు.
ఇప్పుడే అప్డేట్ చేయకపోతే…?
- గడువు పూర్తయిన తర్వాత, ఐటీ డిపార్ట్మెంట్ కనుగొంటే మీరు భారీ పెనాల్టీతో పాటు చట్టపరమైన చర్యలకూ గురి కావాల్సి వస్తుంది.
- మంచి ఫైనాన్షియల్ ఫ్యూచర్ కోసం ఇప్పుడే అప్డేట్ చేసుకోవడం మంచిది.
తప్పు తెలిసి కూడా అప్డేట్ చేయకపోతే, అది పెద్ద సమస్య అవుతుంది. టైమ్ తక్కువ… వెంటనే అప్డేట్ చేసుకోండి.
మీ అనుమానాలు ఉంటే కామెంట్ చేయండి!