RAIN ALERT: ఏపీ ప్రజలకు పిడుగులాంటి వార్త.. ఈ ప్రాంతాల్లో వర్షాలు..

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఉత్తర-ఈశాన్య దిశగా పయనించి 24 గంటల్లో మధ్య బంగాళాఖాతంపై క్రమంగా బలహీనపడే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. దీని ప్రభావంతో పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, ప్రకాశం, నంద్యాల, అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

రేపు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, ప్రకాశం, నెల్లూరు, శ్రీ సత్యసాయి, చిట్టూరు, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో ఉరుములతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

నిన్న నమోదైన ఉష్ణోగ్రతను పరిశీలిస్తే కర్నూలు జిల్లా ఉలిందకొండలో అత్యధికంగా 40.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ప్రకాశం జిల్లాలోని దరిమడుగులో 40.3 డిగ్రీలు, చిత్తూరు జిల్లాలోని తవణంపల్లెలో 40.1 డిగ్రీలు, కడప జిల్లాలోని అమ్మలమడుగులో 39.9 డిగ్రీలు, అల్లూరి సీతారామరాజు జిల్లాలోని ఎర్రంపేటలో 38.7 డిగ్రీలు, అమరావతిలో 38.7 డిగ్రీలు నమోదయ్యాయి.

Related News

తెలంగాణలోని వివిధ వాతావరణ పరిస్థితుల గురించి ఆ శాఖ అధికారి ధర్మరాజు కీలక విషయాలను వెల్లడించారు. వాతావరణంలో మార్పుల కారణంగా పగటిపూట ఎండలు, రాత్రిపూట వర్షం పడుతుందని ఆయన అన్నారు. ఉత్తర భారతదేశం నుండి దక్షిణ భారతదేశం వరకు పొడి వాతావరణంతో బలమైన గాలులు వీస్తున్నాయని ఆయన అన్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరిగే అవకాశం ఉందని ఆయన అన్నారు. హైదరాబాద్‌లో 38 డిగ్రీలు నమోదవుతుందని ప్రకటించారు.