Andhra Pradesh: జాతీయ యూత్‌ పార్లమెంటుకు ఆంధ్రప్రదేశ్ నుంచి ముగ్గురు అమ్మాయిలు

ఏప్రిల్‌లో జరగనున్న జాతీయ యువ పార్లమెంట్‌కు ఏపీ నుంచి ముగ్గురు బాలికలు ఎంపికయ్యారు. ఈ నెల 28న ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో యూత్ సర్వీసెస్-నెహ్రూ యువ కేంద్రం సంయుక్తంగా నిర్వహించిన వికాసిత్ భారత్ కార్యక్రమంలో విశాఖపట్నం నోడల్ ఏజెన్సీ నుంచి ఎ. జ్యోత్స్న, లాస్య, శివాని ఎంపికయ్యారు. ఢిల్లీలో జరగనున్న జాతీయ యువ పార్లమెంట్‌కు హాజరు కావడానికి వారు అర్హత సాధించారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

విజయనగరం నోడల్ ప్రాంతం నుంచి ముగ్గురు విద్యార్థులు జాతీయ యువ పార్లమెంట్‌కు ఎంపికయ్యారని నెహ్రూ యువ కేంద్రం యువ అధికారి జి. మహేశ్వరరావు తెలిపారు. మార్చి 28న గుంటూరులోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీలో దాదాపు 90 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ ముగ్గురు విద్యార్థులు జాతీయ స్థాయి పోటీలో పాల్గొంటారని, వారందరూ విశాఖపట్నం నుంచి ఎంపికయ్యారని మహేశ్వరరావు తెలిపారు.

ఏపీ గురుకులాల్లో ప్రవేశ పరీక్షలకు దరఖాస్తుల గడువు పొడగింపు

Related News

ఆంధ్రప్రదేశ్ గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో 2025-26 విద్యా సంవత్సరానికి ప్రవేశ పరీక్షలకు దరఖాస్తుల గడువును పొడిగించారు. సంబంధిత గురుకుల పాఠశాలల్లో 5వ తరగతికి మరియు 6, 7, 8 తరగతుల్లోని మిగిలిన ఖాళీలకు అడ్మిషన్ల గడువును పొడిగించారు. APRS SET 2025కి ఇంకా దరఖాస్తు చేసుకోని వారికి ఏప్రిల్ 6 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. జూనియర్ గురుకుల కళాశాలల్లో అడ్మిషన్లు ఇందులో పొందిన ర్యాంక్ ఆధారంగా అందించబడతాయి.

తెలంగాణ గురుకుల ఐదవ తరగతి ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి
2025-26 విద్యా సంవత్సరానికి తెలంగాణ రాష్ట్రంలోని SC, ST, BC, జనరల్ గురుకుల పాఠశాలల్లో ఐదవ తరగతి ప్రవేశాల కోసం నిర్వహించిన ప్రవేశ పరీక్షలో ప్రత్యేక కేటగిరీ విద్యార్థుల ఫలితాలు మరియు సీట్ల కేటాయింపు వివరాలను SC గురుకుల సొసైటీ కార్యదర్శి అళగు వర్షిణి ఇటీవల విడుదల చేశారు. దివ్యాంగులు, అనాథలు, మత్స్యకారులు, మైనారిటీలు, సైనిక కుటుంబాల పిల్లలు, EWS, ఏజెన్సీ ప్రాంతాలు, అత్యంత వెనుకబడిన వర్గాల నుండి సుమారు 13,297 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారని, మొదటి దశలో 1944 మంది విద్యార్థులు సీట్లు పొందారని ఆయన అన్నారు. ఈ వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసినట్లు ఆయన చెప్పారు. 5వ తరగతి నుంచి 9వ తరగతి వరకు అడ్మిషన్ల కోసం పరీక్ష రాసిన అభ్యర్థులందరి మార్కుల వివరాలతో మెరిట్ జాబితాను తయారు చేసినట్లు ఆయన తెలిపారు.