OTT Weekend Watch: వారాంతం వచ్చేసింది. మరి ఈవారం OTT లోకి వచ్చిన వాటిలో చూడాల్సిన మంచి కంటెంట్ ఉన్న సినిమా ఏంటి అన్న సందేహంలో ఉన్నారా? అయితే ఇప్పుడు చెప్పబోయే 5 వెబ్ సిరీస్లు మిస్ కాకుండా చూడండి. ఈ వారం టాప్ వెబ్ సిరీస్ కొత్త సీజన్లు కూడా OTT లోకి అడుగుపెట్టాయి. Netflix, Pime video, Jio Hotstar లలో వీటిని చూడొచ్చు.
టాప్ 5 వెబ్ సిరీస్ ఒక లుక్ వేయండి
ఈ వారం ఎన్నో సినిమాలు, వెబ్ సిరీస్ OTT లోకి అడుగుపెట్టాయి. అయితే వీటిలో 5 వెబ్ సిరీస్ ఎంతో ఆసక్తి రేపుతున్నాయి. నిజానికి ఒకే వారం ఇన్ని ఇంట్రెస్టింగ్ సిరీస్ రావడం అరుదు అనే చెప్పాలి.
Related News
వీటిలో ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న జిద్దీ గర్ల్స్ (Ziddi Girls), సుడల్ సీజన్ 2, ఎంఎక్స్ ప్లేయర్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఆశ్రమ్ సీజన్ 3 పార్ట్ 2, నెట్‌ఫ్లిక్స్ లోకి వచ్చిన డబ్బా కార్టెల్, జియోహాట్‌స్టార్ లోని లవ్ అండర్ కన్‌స్ట్రక్షన్ ఉన్నాయి.
- Sudal Season 2 – Prime Video
ప్రైమ్ వీడియోలో రెండున్నరేళ్ల కిందట వచ్చిన సుడల్ ది వోర్టెక్స్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ కు మంచి రెస్పాన్స్ వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడీ సిరీస్ రెండో సీజన్ ప్రైమ్ వీడియోలోకే వచ్చింది. ఐశ్వర్య రాజేష్ నటించిన ఈ సిరీస్ మంచి థ్రిల్ పంచుతోంది.
2. Dabba Kartel – Netflix
నెట్‌ఫ్లిక్స్ లోకి శుక్రవారం (ఫిబ్రవరి 28) ఓ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ అడుగుపెట్టింది. ఈ సిరీస్ పేరు డబ్బా కార్టెల్. ముంబై శివార్లలో ఉండే కొందరు గృహిణులు లంచ్ డబ్బాల పేరుతో డ్రగ్స్ వ్యాపారం చేస్తుంటారు. ఓ రోజు అనుకోకుండా వాళ్ల జీవితాలు మలుపు తిరుగుతాయి. షబానా అజ్మీ, జ్యోతికలాంటి వాళ్లు నటించిన సిరీస్ ఇది.
3. Ziddi Girls – Prime Video
ప్రైమ్ వీడియో ఓటీటీలోకే జిద్దీ గర్ల్స్ అనే ఓ బోల్డ్ వెబ్ సిరీస్ వచ్చింది. ఐదుగురు అమ్మాయిల చుట్టూ తిరిగే సిరీస్ ఇది. జనరేషన్ జెడ్ వాళ్లు మిస్ కాకుండా చూడాల్సిన సిరీస్. దీనికి రివ్యూలు కూడా పాజిటివ్ గానే వస్తున్నాయి. ఈ వీకెండ్ చూసేయండి మరి.
4. Love Under Construction – JioHotstar
జియోహాట్‌స్టార్ లోకి ఓ రొమాంటిక్ కామెడీ వెబ్ సిరీస్ వచ్చింది. ఈ సిరీస్ పేరు లవ్ అండర్ కన్‌స్ట్రక్షన్. ఇదొక మలయాళం వెబ్ సిరీస్. కానీ తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది. ఓవైపు సొంతిల్లు, మరోవైపు ప్రేమ మధ్య నలిగిపోయే యువకుడి చుట్టూ తిరిగే కథ ఇది.
5. Ashram Season 3 Part 2 – MX Player
అమెజాన్ ఎంఎక్స్ ప్లేయర్ లోకి థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఏక్ బద్నామ్ ఆశ్రమ్ మూడో సీజన్ రెండో పార్ట్ స్ట్రీమింగ్ కు వచ్చింది. తొలి మూడు సీజన్లు ఎంతో అలరించిన ఈ సిరీస్.. ఇప్పుడు మరో ఐదు ఎపిసోడ్లను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. వీటిని ఫ్రీగా చూడొచ్చు. యానిమల్ విలన్ బాబీ డియోల్ లీడ్ రోల్లో నటించిన సిరీస్ ఇది.