LIC, దేశంలోనే అతిపెద్ద ఇన్సూరెన్స్ కంపెనీ, కొత్తగా “స్మార్ట్ పెన్షన్ ప్లాన్” అనే ప్రత్యేకమైన పెన్షన్ స్కీమ్‌ను ప్రవేశపెట్టింది. ఇది ఆర్థిక భద్రతతో పాటు లైఫ్‌టైమ్ ఆదాయం అందించే ప్లాన్. ఉద్యోగం లేకపోయినా, పదవీ విరమణ అయినా జీతం వచ్చినట్లే నెల నెలా డబ్బు రావాలనుకునే వారికి ఇది బెస్ట్ ప్లాన్.
LIC Smart Pension ప్లాన్ ప్రత్యేకతలు
- జీవితాంతం నెలకు గ్యారెంటీ పెన్షన్
- ఒక్కసారిగా రూ.1 లక్ష పెట్టుబడి పెడితే నెలకు రూ.1,000 పెన్షన్
- సింగిల్ లేదా జాయింట్ పెన్షన్ ఎంపికలు
- మరణానంతరం కుటుంబానికి ఆర్థిక భద్రత
- NPS సభ్యులకు ప్రత్యేక ప్రయోజనాలు
- తక్షణ పెన్షన్ పొందే అవకాశం
- అవసరమైతే డబ్బును తీయగలిగే వెసులుబాటు
ఎవరెవరు జాయిన్ అవ్వవచ్చు?
కనీస వయస్సు: 18 ఏళ్ల నుంచి ప్రారంభించవచ్చు
గరిష్ట వయస్సు: 65 నుంచి 100 ఏళ్ల లోపు, ఎంపిక చేసిన ప్లాన్‌పై ఆధారపడి ఉంటుంది
ఇందులో ఎలాంటి పెన్షన్ ఎంపికలు ఉన్నాయి?
- సింగిల్ లైఫ్ పెన్షన్: పాలసీదారుడికి జీవితాంతం పెన్షన్
- జాయింట్ లైఫ్ పెన్షన్: భర్త లేదా భార్య ఇద్దరిలో ఎవరు బతికున్నా పెన్షన్ అందుతుంది
పెన్షన్ అందుకునే విధానం (అన్ని మినిమమ్ అమౌంట్స్)
- నెలకు – ₹1,000
- త్రైమాసికం (3 నెలలకు) – ₹3,000
- ఆరునెలలకోసారి (6 నెలలకు) – ₹6,000
- ఏడాదికి (12 నెలలకు) – ₹12,000
(గరిష్ట పెన్షన్ ఎన్ని కావాలంటే అన్ని పొందవచ్చు, ఎటువంటి లిమిట్ లేదు)
పాలసీదారుడు మధ్యలో డబ్బు తీసుకోవచ్చా?
- హంగామిలేకుండా పూర్తి లేదా పాక్షికంగా డబ్బు విత్‌డ్రా చేసుకునే వెసులుబాటు ఉంది.
- 3 నెలలు పూర్తైన తర్వాత లేదా “ఫ్రీ-లుక్ పీరియడ్” తర్వాత లోన్ కూడా తీసుకోవచ్చు.
పాలసీదారుడు మరణించినట్లయితే కుటుంబానికి ఏమి లభిస్తుంది?
- ఎంపిక చేసిన పథకం ఆధారంగా కుటుంబానికి లంప్‌సమ్ అమౌంట్ / నెలకోసారి పెన్షన్ / ఇన్‌స్టాల్‌మెంట్స్‌లో డబ్బు లభిస్తుంది.
- కొంత మొత్తం లంప్‌సమ్ తీసుకుని మిగిలిన డబ్బును పెన్షన్ రూపంలో కొనసాగించుకునే అవకాశం కూడా ఉంది.
LIC Smart Pension ఎలా కొనాలి?
ఆఫ్లైన్: LIC ఏజెంట్లు, POSP-లైఫ్ ఇన్సూరెన్స్ ఎగ్జిక్యూటివులు, కమన్ పబ్లిక్ సర్వీస్ సెంటర్లు
ఆన్‌లైన్: LIC అధికారిక వెబ్‌సైట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు
Related News
ఎందుకు ఈ స్కీమ్ మిస్ కాకూడదు?
రాష్ట్ర ప్రభుత్వ పెన్షన్ ఇప్పుడు అందరికి లేదు. ఎప్పుడెప్పుడు ఆదాయం తగ్గిపోతుందో తెలియదు. ఇప్పుడే ఇన్వెస్ట్ చేస్తే జీవితాంతం ఆదాయం గ్యారెంటీ
పదవీ విరమణ తర్వాత మీ భవిష్యత్తును ఆర్థికంగా స్ట్రాంగ్‌గా ప్లాన్ చేసుకోండి! ఇప్పుడే LIC Smart Pension తీసుకోండి.