నేటి ఇన్‌ఫ్లేషన్ కాలంలో ప్రతీ ఒక్కరూ తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనాలు కలిగే మొబైల్ ప్లాన్ కోసం వెతుకుతున్నారు. ఎప్పటినుంచో జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ లాంటి ప్రైవేట్ నెట్‌వర్క్‌ల రిచార్జ్ ధరలు భారీగా పెరిగిపోయాయి. ప్రతి నెలా మన ఖర్చు పెరుగుతోంది. అందుకే చాలామంది ఇప్పుడు ప్రభుత్వ టెలికాం సంస్థ అయిన BSNL వైపు మళ్లుతున్నారు. కారణం – BSNL ప్లాన్‌లు మరీ చవకగా ఉండటం.
ఇక మీరు కూడా ప్రతి నెలా డబ్బులు వేసే ఖర్చుతో విసిగిపోయి, తక్కువ ఖర్చుతో, ఎక్కువ రోజులు నెంబర్ యాక్టివ్‌గా ఉండే ప్లాన్ కోసం చూస్తున్నట్లయితే, ఈ రోజు మీకో మంచి వార్త ఉంది. BSNL ఇచ్చే ఈ ప్లాన్ ఖరీదు రూ.1200 కంటే తక్కువ. validity ఏకంగా 365 రోజులు. అంటే ఒక్కసారి రిచార్జ్ చేస్తే, ఏడాది పాటు మీరు తిరిగి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు.
BSNL రూ.1198 ప్లాన్ డీటెయిల్స్ తెలుసా?
ప్రభుత్వ సంస్థ అయిన BSNL ప్రతి కస్టమర్ బడ్జెట్‌కి తగ్గట్లుగానే ప్లాన్‌లు తీసుకొస్తోంది. అటువంటి ప్లాన్‌ల్లోనే ఇది కూడా ఒకటి. రూ.1198 పెట్టి రిచార్జ్ చేస్తే, ఏకంగా 365 రోజుల వ్యాలిడిటీ వస్తోంది. అంటే ఏడాది పాటు మీరు నెట్‌వర్క్ యాక్టివ్‌గా ఉంచుకోవచ్చు. ముఖ్యంగా బ్యాంకింగ్, OTP, లేదా నంబర్ కీపింగ్ కోసం ఫోన్ నెంబర్ ఉంచుకోవాలనుకునే వారికి ఇది సూపర్ ప్లాన్ అవుతుంది.
Related Posts
ఇక ఈ ప్లాన్‌కి ప్రతి నెలా 300 నిమిషాల వరకు స్థానిక (Local) మరియు STD కాల్స్ చేసుకునే అవకాశం ఉంటుంది. అంతేకాదు, ప్రతి నెలా 3GB డేటా కూడా వస్తోంది. అంటే మీకు అంతగా డేటా అవసరం లేకపోతే, ఇది సరిపోతుంది. అదనంగా ప్రతి నెల 30 SMSలు కూడా వస్తున్నాయి. టోటల్‌గా చూస్తే, తక్కువ ధరలో బేసిక్ అవసరాలు అన్నీ కవర్ చేసేలా BSNL ప్లాన్‌ను రూపొందించింది.
ఇప్పుడు అదే ధరలో జియో ప్లాన్‌ను చూసేండి. జియోలో రూ.1199 ప్లాన్‌లో 3 నెలల వ్యాలిడిటీ మాత్రమే ఉంది. అంటే కేవలం 84 రోజులు మాత్రమే. అయితే జియో ఈ ప్లాన్‌లో ప్రతి రోజూ 3GB డేటా ఇస్తోంది. అలాగే రోజుకు 100 SMSలు మరియు అన్‌లిమిటెడ్ కాల్స్ కూడా ఉన్నాయి. ఇంకా అదనంగా Jio TV, JioCinema, JioCloud వంటివి కూడా ఉచితంగా వస్తాయి. Hotstar మొబైల్/TV సబ్‌స్క్రిప్షన్ కూడా 90 రోజులపాటు ఉచితం. Jio AI Cloud స్టోరేజ్ 50GB ఉచితంగా వస్తుంది. మరియు 5G డేటా అన్‌లిమిటెడ్‌గా ఇచ్చే బెనిఫిట్ కూడా ఉంది, కానీ ఇది కేవలం 5G యూజర్స్‌కు మాత్రమే అందుబాటులో ఉంటుంది.
అయితే ఇక్కడ అసలు విషయం ఏమిటంటే – జియో ప్లాన్ ధర BSNL కన్నా ఎక్కువే. కానీ validity మాత్రం చాలా తక్కువ. 84 రోజుల తర్వాత మళ్లీ మరోసారి రిచార్జ్ చేయాల్సిందే. అంటే ఏడాదికి కనీసం 4 సార్లు ఈ ప్లాన్ చేసుకుంటే దాదాపు రూ.4800 వరకు ఖర్చు అవుతుంది. అదే BSNL ప్లాన్ చూస్తే, ఏడాది మొత్తం కవర్ అవుతుంది. ఇక ఖర్చు కేవలం రూ.1198 మాత్రమే.
ఇప్పుడు చాలామందికి ఎక్కువ డేటా అవసరం ఉండదు. కేవలం బ్యాంక్ OTPలు రావాలంటే, UPI యాక్సెస్ ఉండాలంటే లేదా ఫోన్ నెంబర్ యాక్టివ్‌గా ఉంచుకోవాలంటే మాత్రమే SIM వాడతారు. అలాంటి వారికి జియో లాంటి ప్రైవేట్ ప్లాన్‌లు ఖరీదుగా ఉంటాయి. అదే సమయంలో ఎక్కువ అవసరములేని వారికి BSNL ప్లాన్‌లు ఎంతో మంచి చాయిస్ అవుతాయి.
ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, BSNL సేవలు చాలా రాష్ట్రాల్లో ఇప్పుడు మెరుగవుతున్నాయి. 4G టవర్స్ ఏర్పాటవుతున్నాయి. గతంతో పోలిస్తే నెట్‌వర్క్ కవరేజ్ మెరుగవుతోంది. అందువల్ల బేసిక్ వినియోగదారులకు ఇది బాగానే పనిచేస్తోంది. కనీసం ఓటీపీ కోసం ప్లాన్ చేయాలంటే ఇది చౌకగా ఉంటుంది.
ఒక్కసారి ఏడాదికి రూ.1198 పెట్టి BSNL ప్లాన్ చేసుకుంటే, తర్వాత 365 రోజులు SIM యాక్టివ్ ఉంటుంది. మళ్లీ మళ్లీ రిచార్జ్ చేయాల్సిన అవసరం లేదు. డేటా, కాలింగ్, SMS కూడా లిమిటెడ్‌గా వస్తాయి. నెంబర్ యాక్టివ్ ఉంచుకునే లక్ష్యంతో చూస్తే ఇది బెస్ట్ ప్లాన్. జియో లాంటి ప్రైవేట్ నెట్‌వర్క్‌లతో పోలిస్తే ఖర్చు చాలా తక్కువగా ఉంటుంది.
మీరు కూడా చవకైన ప్లాన్ కోసం వెతుకుతున్నట్లయితే, ఇప్పుడు BSNL రూ.1198 ప్లాన్‌ను ఒక్కసారి ట్రై చేయండి. ఒకసారి రిచార్జ్ చేస్తే ఏడాది టైం టెన్షన్ లేదు. అంతకంటే చవకగా, నెంబర్ యాక్టివ్ ఉండే ప్లాన్ మీరు మళ్లీ ఎక్కడా చూడలేరు…