ప్రైవేట్ టెలికాం కంపెనీలు డేటా ప్లాన్ల ధరలు పెంచినప్పటి నుండి, చాలా మంది యూజర్లు ప్రభుత్వ టెలికాం సంస్థ అయిన BSNL వైపు మొగ్గుతున్నారు. తక్కువ ధరకు ఎక్కువ బెనిఫిట్స్ అందిస్తున్న BSNL ఇప్పుడు వినియోగదారుల మనసులు గెలుస్తోంది. రోజుకు డేటా కావాలా? నంబర్ యాక్టివ్ గా ఉంచాలా? అన్నింటికీ ఒకే సొల్యూషన్ ప్లాన్ ఇది
BSNL రూ.397 ప్లాన్ డీటెయిల్స్
BSNL కొత్తగా తీసుకువచ్చిన రూ.397 ప్లాన్ ఇప్పుడు టెక్ వరల్డ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఈ ప్లాన్ ధర కేవలం రూ.397 మాత్రమే. ఇది 150 రోజుల పాటు మీ నంబర్ యాక్టివ్ గా ఉంచుతుంది. మొదటి 30 రోజుల పాటు మీరు పూర్తి బెనిఫిట్స్ పొందవచ్చు. అంటే రోజుకు 2GB హై స్పీడ్ డేటా, రోజుకు 100 SMSలు, అన్ని నెట్‌వర్క్స్‌కి అన్‌లిమిటెడ్ కాల్స్.
30 రోజుల తర్వాత డేటా స్పీడ్ తగ్గి 40Kbps అవుతుంది కానీ మీ నంబర్ మాత్రం మొత్తం 150 రోజుల వరకు యాక్టివ్ గానే ఉంటుంది. అంటే టచ్ లో ఉండాలంటే ఖచ్చితంగా ఇది బెస్ట్ ప్లాన్. ప్రయాణాలు చేసే వారు, బ్యాకప్ నంబర్ వాడేవారు, సెకండ్ ఫోన్ కోసం నంబర్ అవసరమై ఉండేవారికి ఇది సూపర్ ఛాయిస్.
Related News
BSNL రూ.997 ప్లాన్ కోసం చూస్తున్నారా?
ఇంకొక ఆప్షన్ కూడా ఉంది. రూ.997 ప్లాన్. ఇది మొత్తం 160 రోజుల వాలిడిటీతో వస్తుంది. రోజుకు 2GB డేటా, 100 SMS, అన్‌లిమిటెడ్ కాల్స్ అన్నీ ఇందులోనూ ఉన్నాయి. 5 నెలలకి పైగా యాక్టివ్ వాలిడిటీ కావాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్.
ఇప్పుడు తీసుకోకపోతే లాస్ మీదే
ఈ బడ్జెట్ ప్లాన్లకు ఎలాంటి హిడన్ ఛార్జెస్ లేవు. ప్రైవేట్ కంపెనీల ధరలు ఎప్పటికప్పుడు పెరుగుతున్న ఈ రోజుల్లో, BSNL ప్లాన్లు తీసుకోవడం ద్వారా డబ్బు కూడా సేవ్ అవుతుంది. మీ నంబర్ యాక్టివ్ గా ఉంచాలంటే లేదా రోజూ చాట్, కాల్స్, OTT Browsing కోసం ప్లాన్ కావాలంటే ఇవి బంగారం లాంటి ప్లాన్లు.