Tata Carపై రూ. లక్ష వరకు డిస్కౌంట్ ఆఫర్

కారు కొనాలనుకునే వారికి ఇది మంచి సమయం. ఎంపిక చేసిన మోడళ్లపై టాటా మోటార్స్ గరిష్టంగా లక్ష రూపాయల వరకు డిస్కౌంట్ ప్రకటించింది. వీటిలో టియాగో, టిగోర్, ఆల్ట్రోజ్, పంచ్, నెక్సాన్, హారియర్ మరియు సఫారీ మోడల్‌లు ఉన్నాయి.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

టియాగోపై రూ. 35 వేల డిస్కౌంట్‌ను టాటా ప్రకటించింది. టిగోర్ మోడల్‌పై రూ. 45 వేలు, ఆల్ట్రోజ్ రేసర్ మినహా అన్ని వేరియంట్లపై రూ. 6 వేలు, పంచ్‌పై రూ. 25 వేలు, నెక్సాన్‌పై రూ. 45 వేలు డిస్కౌంట్‌ను ప్రకటించింది. హారియర్ మరియు సఫారీ ఎస్‌యూవీల డీజిల్ వేరియంట్లపై రూ. 75 వేలు డిస్కౌంట్‌ను కూడా అందిస్తోంది. ఆల్ట్రోజ్ మరియు నెక్సాన్ డీజిల్ వేరియంట్లపై వరుసగా రూ. 65 వేలు మరియు రూ. 45 వేలు డిస్కౌంట్‌ను అందిస్తోంది. ఆల్ట్రోజ్ పెట్రోల్ రేస్ వేరియంట్‌పై టాటా మోటార్స్ రూ. 1 లక్ష వరకు డిస్కౌంట్‌ను ప్రకటించింది.