ఏప్రిల్ 1, 2025 నుండి అమలులోకి రానున్న యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ (UPS) ద్వారా ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్ భద్రత పెరుగనుంది. UPS కింద ఉద్యోగి 10% తన ప్రాథమిక జీతం నుండి పెట్టుబడి వేయగా, ప్రభుత్వం 18.5% వాటా చెల్లిస్తుంది.
మొత్తం 28.5% కాంట్రిబ్యూషన్ లో 20% మార్కెట్-లింక్డ్ స్కీమ్ లో పెట్టుబడి చేయబడుతుంది, మిగిలిన 8.5% హామీగల పెన్షన్ స్కీమ్ లో పెట్టుబడి చేయబడుతుంది.
UPS లో పెన్షన్ ఎలా లెక్కించబడుతుంది?
- కనీసం 10 ఏళ్లు ఉద్యోగం చేసినవారికి రూ.10,000 గ్యారంటీ పెన్షన్ లభిస్తుంది.
- 25 ఏళ్ల సర్వీస్ పూర్తయిన తర్వాత చివరి మూడేళ్ల సగటు జీతం 50% పెన్షన్ గా లభిస్తుంది.
- రిటైర్మెంట్ సమయంలో ఉద్యోగికి లంప్ సమ్ (ఒక్కసారిగా) ఓ పెద్ద మొత్తం కూడా లభిస్తుంది.
ఉదాహరణ: రూ.70,000 జీతం ఉన్న ఉద్యోగి (20 ఏళ్ల సర్వీస్) UPS పెన్షన్ లెక్కలు
- హామీ పెన్షన్ (DA సహా) = రూ.42,840
- ఫ్యామిలీ పెన్షన్ (DA సహా) = రూ.25,704
- రిటైర్మెంట్ సమయంలో లంప్ సమ్ = రూ.4,28,400
UPS లో మార్కెట్ పెట్టుబడులు నష్టపోతే?
మార్కెట్ పెట్టుబడులు ఆశించిన లాభాలు ఇవ్వకపోయినా ప్రభుత్వం కనీస పెన్షన్ హామీ ఇస్తుంది.
Related News
UPS పెట్టుబడులు లాభాలు తెచ్చినట్లైతే?
- మార్కెట్ స్కీమ్ లాభాలు ఎక్కువగా వచ్చినట్లైతే ఉద్యోగికి హామీ పెన్షన్ కంటే ఎక్కువ మొత్తంలో పెన్షన్ లభిస్తుంది.
ఇలాంటి భరోసా కలిగించే స్కీమ్ మిస్ అవ్వకండి. ఇప్పుడే మీ UPS ఎంపికపై ఆలోచించండి