GOLD STOLEN: విశాఖ గాజువాకలో రెచ్చిపోయిన దొంగలు.. ఏకంగా 90 తులాల బంగారం చోరీ..

విశాఖ గాజువాకలో దొంగలు విధ్వంసానికి పాల్పడ్డారు. కూర్మపాలెంలోని కాపుజగ్గరాజుపేటలోని వసుధ గార్డెన్స్‌లో దొంగతనం చేశారు. ఇంటి తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించి 90 తులాల బంగారాన్ని దోచుకున్నారు. తలుపులు తెరిచి ఉండటంతో పొరుగువారు యజమానికి సమాచారం ఇచ్చారు. బాధితులు దువ్వాడ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని బాధితుల నుండి వివరాలు సేకరించారు. దొంగతనం జరిగిన ప్రాంతాన్ని క్లూస్ టీమ్‌తో పరిశీలించారు. స్థానిక సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు. సంఘటనపై కేసు నమోదు చేశారు. నిందితులను త్వరలో అరెస్టు చేస్తామని వారు తెలిపారు. ప్రత్యేక బృందాలతో వెతుకుతామని వారు తెలిపారు. అయితే, గతంలో దొంగతనాలు జరిగాయని, పోలీసులకు ఫిర్యాదు చేశామని, కానీ కొన్ని రోజులుగా గస్తీ తిరుగుతున్నామని, అప్పటి నుండి తిరిగి రాలేదని స్థానికులు తెలిపారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now