ఉత్తరప్రదేశ్‌లో ఇద్దరు మహిళలు వివాహం చేసుకున్న సంఘటన సంచలనం సృష్టించింది. గోరఖ్‌పూర్ జిల్లాకు చెందిన కవిత, గుంజా అనే ఇద్దరు మహిళలు ఇళ్లను వదిలి కొన్ని నెలలుగా కలిసి జీవిస్తున్నారు.
ఒకరినొకరు లేకుండా జీవించలేమని తెలిసి, స్థానిక ఆలయంలో వివాహం చేసుకున్నారు. 4 సంవత్సరాల క్రితం ఇన్‌స్టాగ్రామ్‌లో ఇద్దరూ కలిశారు.. భర్తలు వేధింపులకు గురిచేయడంతో ఇళ్లను వదిలి కలిసి జీవించామని వారు చెప్పారు. ఇంతలో, గుంజా తన పేరును బబ్లూగా మార్చుకున్నాడని, తనకు భర్త అవుతాడని కవిత వెల్లడించింది. అయితే, వారి వివాహానికి కారణం తెలిసి నెటిజన్లు షాక్ అయ్యారు.