యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బాహుబలి సినిమాతో వరల్డ్ వైడ్ ఫాలోయింగ్ సంపాదించుకున్న డార్లింగ్ చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నాడు. రీసెంట్ గా కల్కి సినిమాతో థియేటర్లలోకి వచ్చిన డార్లింగ్ ఇప్పుడు రాజాసాబ్ చిత్రీకరణలో పాల్గొంటున్నాడు. వచ్చే ఏడాది సినిమా విడుదల కానుంది
ప్రముఖ మీడియా సంస్థ ఆర్మాక్స్ దేశంలోని ప్రముఖులపై ప్రతినెలా సర్వే నిర్వహించి జాబితా విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఇది భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన మరియు అగ్ర స్థానాల్లో ఉన్న వారి జాబితాలను విడుదల చేస్తుంది. అందులో భాగంగానే నవంబర్ నెలలో అత్యంత ప్రజాదరణ పొందిన తారల జాబితాను ప్రకటించింది. ఇందులో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నవంబర్‌లో మొదటి స్థానంలో నిలిచాడు. హీరోయిన్లలో సమంత మొదటి స్థానంలో నిలిచింది. అంతేకాదు వరుసగా మూడో నెల (సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్) హీరోయిన్ల జాబితాలో సమంత మొదటి స్థానంలో నిలిచింది. ప్రభాస్ వరుసగా రెండో నెల (అక్టోబర్, నవంబర్) కూడా నిలిచాడు. నవంబర్ నెలలో ప్రకటించిన మోస్ట్ పాపులర్ స్టార్ లిస్ట్‌లో ప్రభాస్ తర్వాత విజయ్ తలపతి రెండవ స్థానంలో ఉన్నాడు.
వీరిద్దరి తర్వాత అల్లు అర్జున్, షారుక్ ఖాన్, ఎన్టీఆర్, అజిత్ కుమార్, మహేష్ బాబు, సూర్య, రామ్ చరణ్, అక్షయ్ కుమార్ మొదటి స్థానంలో నిలిచారు. అలాగే హీరోయిన్ల విషయానికి వస్తే సమంత మొదటి స్థానంలో ఉంది. సామ్ ఇప్పటికే మూడుసార్లు నంబర్ వన్‌గా నిలిచి హ్యాట్రిక్ రికార్డు సృష్టించింది. ఆ తర్వాత అలియా భట్, నయనతార, సాయి పల్లవి, దీపికా పదుకొణె, త్రిష, కాజల్, రష్మిక మందన్న, శ్రద్ధా కపూర్, కత్రినా కైఫ్ టాప్ 10లో ఉన్నారు.
Related News
ఇదిలా ఉంటే కొన్నాళ్లు సినిమాలకు గ్యాప్ తీసుకున్న సామ్ ఇప్పుడు రీ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతోంది. ఇటీవలే సిటాడెల్ వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారం కానుంది. అలాగే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సమంత రెగ్యులర్ గా ఏదో ఒక పోస్ట్ చేస్తుంటుంది.