ఉపాధ్యాయలు ప్రతి రోజు తప్పని సరిగా రెండు పూటలా ముఖ హాజరు వేయవలెనని ఆదేశాలు ఉన్నప్పటికీ కొంత మంది ఆశ్రర్ధ వహిస్తుండటం ఫలితం గా ఈ రోజు ఏలూరు జిల్లాలో ఒక టీచర్ ను జిల్లా విద్యా శాఖాధికారి వారు సస్పెండ్ చేయటం జరిగింది.
సదరు టీచర్ రోజు విదియగా హాజరు నమోదు చేయక పోవటం, కొన్ని సార్లు ఒక్క పూట మాత్రమే హాజరు వేయటం గమనించి న కమాండ్ కంట్రోల్ రూమ్ వారు వీరి రికార్డు పరిశీలన నిమిత్తం అధికారులకి పంపిన నేపథ్యం లో జిల్లా విద్యా శాఖాధికారి పరిశీలించి అది నిజమని నమ్మిన తరువాత ఆ టీచర్ పై సస్పెన్షన్ వేటు వేయటం జరిగింది.
సస్పెన్షన్ కి కారణాలు
- రోజు ముఖ హాజరు వేయక పోవటం
- అప్పుడప్పుడు ఒక్క పూట మాత్రమే హాజరు వెయ్యటం
- లీడర్ షిప్ ట్రైనింగ్ కి అటెండ్ కాకపోవటం
- MDM రోజు వారి రిపోర్ట్ లు పెట్టక పోవటం
- లీవ్ లెటర్ పెట్టకుండా సెలవు తీసుకోవటం
సెలవు విషయం లో ప్రధానోపాధ్యాయులతో గొడవ పడటం - రెండు తరగతులు మాత్రమే బోదిస్తా అనటం
- FA మార్కులు ఆన్లైన్ చేయక పోవటం
అదే కాకుండా గతం లో ఈ టీచర్ leadership ట్రైనింగ్ కు హాజరు అవ్వకపోవటం కూడా గమనించటం జరిగింది. ఈ టీచర్ పై Andhra Pradesh Civil Services (CC&A) Rules, 199 ప్రకారం విధుల నుంచి సస్పెండ్ చేయటం జరిగింది .
Related News
పై సంఘటన ప్రకారం ప్రతి టీచర్ ముఖ హాజరు ని సీరియస్ గ తీసుకుని తప్పకుండ రెండు పూటలా వేసేలా ప్రత్యేక శ్రర్ధ వహించాలి.