
ఈ రోజుల్లో ఖర్చులు పెరిగిపోతున్నాయి కానీ ఆదాయ మార్గాలు మాత్రం స్థిరంగా లేవు. అలాంటి పరిస్థితుల్లో మనకో చిన్న పెట్టుబడితో పెద్ద ఆదాయాన్ని ఇచ్చే అవకాశం వస్తే మాత్రం వెంటనే పట్టుకోవాలి. అచ్చం అలాంటిదే భారత్ పోస్ట్ నుండి వచ్చిన Franchise Outlet Scheme 2025. ఇది ప్రభుత్వ సంస్థ నుంచి వచ్చిన ప్రైవేట్ బిజినెస్ ఛాన్స్. అంటే ఇది ఉద్యోగం కాదు కానీ ఉద్యోగానికి సమానమైన ఆదాయం వచ్చే అవకాశముంది.
మీ ఇంట్లో ఒక గది లేదా చిన్న షాపు ఉంటే చాలు. అది కూడా ఎక్కువ ఖర్చు అవసరం లేని స్థలం. ఆ గదిలో మీరు పోస్ట్ ఆఫీస్‌కు సంబంధించిన సేవలు అందిస్తారు. ఇందుకోసం మీరు ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంటారు. మీరు చేసే ప్రతి సేవపై కమిషన్ రూపంలో ఆదాయం వస్తుంది. ఈ ఆదాయం నెలకు కనీసం ₹15,000 నుంచి ₹40,000 వరకు ఉండొచ్చు. మీ ప్రాంతంలో ఉన్న డిమాండ్‌ను బట్టి ఈ ఆదాయం ఇంకా ఎక్కువయ్యే ఛాన్స్ ఉంటుంది.
ఈ ఫ్రాంచైజీ స్కీం వెనక ఉన్న ఉద్దేశం చాలా గొప్పది. మన దేశంలో ఇప్పటికీ కొన్ని గ్రామాలు, పట్టణాలు పోస్టల్ సేవలకు దూరంగా ఉన్నాయి. అలాంటి ప్రాంతాల్లో స్థానికులే ఇలా పోస్ట్ ఆఫీస్ సేవలు అందిస్తే అందరికీ సౌకర్యంగా ఉంటుంది. మళ్లీ ప్రభుత్వం కొత్తగా స్టాఫ్ పెట్టాల్సిన అవసరం లేకుండా, స్థానికులను పార్ట్నర్గా మార్చి సేవలు విస్తరిస్తోంది. ఇది ప్రభుత్వానికి లాభం, మీకు ఆదాయం అనే విధంగా పని చేస్తుంది.
[news_related_post]మీరు ఈ స్కీమ్ ద్వారా అందించే సేవల్లో స్పీడ్ పోస్ట్, రిజిస్టర్డ్ పోస్ట్, మనీ ఆర్డర్స్, స్టాంపుల అమ్మకం, పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం కలెక్షన్ వంటి సేవలు ఉంటాయి. వీటిపై మీరు కమిషన్ పొందుతారు. ఉదాహరణకి, స్పీడ్ పోస్ట్‌పై 7% నుంచి 25% వరకు, మనీ ఆర్డర్‌కి ఒక్కోటి ₹3 నుంచి ₹5 వరకు వస్తుంది. స్టాంపులపై కూడా 5% వరకూ లాభం వస్తుంది. ఇలా చూస్తే నెలకు కనీసం ₹15,000 నుంచి ₹40,000 వరకు సంపాదించవచ్చు.
ఈ స్కీం కోసం అర్హతలు కూడా చాలా తక్కువగా ఉన్నాయి. కనీసం 8వ తరగతి పాస్ అయిన వారు దరఖాస్తు చేయొచ్చు. వయస్సు 18 ఏళ్లు పైబడాలి. షాప్ ఉండాలి అంటే కనీసం 100 చ.అ. స్థలం ఉండాలి. ₹5,000 నుంచి ₹10,000 వరకు డిపాజిట్ అవసరం ఉంటుంది. కాస్త కంప్యూటర్ అవగాహన ఉంటే సరిపోతుంది. దరఖాస్తు విధానం కూడా చాలా సులభం. మీరు ఇండియా పోస్ట్ వెబ్‌సైట్‌కి వెళ్లి ఫారం డౌన్లోడ్ చేసి మీ జిల్లా పోస్టల్ డివిజన్‌కి సమర్పిస్తే చాలు. స్థలాన్ని పరిశీలించాక, ఎంపికైనవారితో ఒప్పందం చేసుకుని చిన్న ట్రైనింగ్ తర్వాత ఫ్రాంచైజీగా ప్రారంభించవచ్చు.
ఇది తక్కువ పెట్టుబడితో ప్రారంభించదగిన మంచి ఆదాయ మార్గం. ముఖ్యంగా ఇంటి వద్ద ఖాళీ గది ఉన్నవారు, గృహిణులు, రిటైర్డ్ ఉద్యోగులు, యువత ఇలా ఎవరికైనా ఇది సరైన అవకాశం. ప్రైవేట్ బిజినెస్ లా ఉన్నా, ఇది ప్రభుత్వ భరోసాతో కూడిన పథకం. మీ దగ్గర ఖాళీ స్థలం ఉంటే, మీకు మళ్లీ అలాంటి అవకాశం రావడం కష్టం. కనుక ఇప్పుడే దరఖాస్తు చేసి, ₹40,000 వరకు నెలవారీ ఆదాయాన్ని సంపాదించండి. ఇప్పుడు ఓపెన్ చేస్తేనే లాభం, ఆలస్యం చేస్తే అవకాశం మిస్సవుతుంది!