ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ఓటింగ్ ముగిసిన తర్వాత అధికారం మనదేనని ఎవరి లెక్కలు వారు చెబుతున్నారు. మరింత గెలుస్తామని వైసీపీ పార్టీ భావిస్తోంది.
మేమే ఎక్కువ గెలుస్తామని టీడీపీ కూడా భావిస్తోంది. అయితే ఇక్కడ రెండు కీలకాంశాలు ఉన్నాయి. రాయలసీమలో 40 సీట్లు, ఉత్తరాంధ్రలో 15 సీట్లు, వైజాగ్‌తో కలిపి కనీసం 20 సీట్లు వస్తాయని వైసీపీ అంచనా.
మొత్తంగా అక్కడొక 40 సీట్లు, ఇక్కడ 20 సీట్లు, మొత్తం 60 సీట్లు.. మిగతా గోదావరి జిల్లాల్లో 10 సీట్లు వస్తాయని.. కృష్ణా గుంటూరు జిల్లాల్లో 10 సీట్లు వస్తాయని.. నెల్లూరు ప్రకాశం జిల్లా వైపు 10 సీట్లు వస్తాయని అంచనా. . మొత్తం 100 సీట్లకు తగ్గకుండా వస్తాయని YCP వాళ్ళు విశ్వాసంతో ఉన్నారు. అదే సందర్భంలో ఉత్తరాంధ్ర తమకు అండగా ఉంటుందన్న నమ్మకంతో ఉన్నారు.
తెలుగుదేశం వాళ్లు ఎలా లెక్కలు వేస్తున్నారు అంటే ఈసారి రాయలసీమకు 30 సీట్లు, నెల్లూరు జిల్లాలో 5 సీట్లు వస్తాయని అందుకే 35 సీట్లు వస్తాయని అంచనా వేస్తున్నారు. వాస్తు సినీలియో ప్రకారం ప్రకాశం గుంటూరు కృష్ణా జిల్లాల్లో దాదాపు 15 సీట్లు వస్తాయి. గోదావరి జిల్లాల్లో 20 నుంచి 35 సీట్లు, ఆ తర్వాత ఉత్తరాంధ్రలో 20 నుంచి 30 సీట్లు గ్యారెంటీ అన్నట్లుగా లెక్కలు వేసుకుంటున్నారు. మొత్తంగా 100 నుంచి 110 సీట్లు వస్తాయని చెబుతున్నారు. మరి ఎవరి లెక్కలు వారివే.. ఏది నిజమో జూన్ నాలుగో తేదీకి తేలనుంది.