Egypt Pyramids: ఈజిప్టు పిరమిడ్స్ నిర్మాణం గురించి వీడుతున్న గుట్టు…!

ప్రపంచంలోని ఏడు అద్భుతాలలో ఈజిప్టు పిరమిడ్‌లు కూడా ఉన్నాయి. ప్రపంచంలోనే అతి పొడవైన నైలు నది కూడా ఈ నగరం గుండా ప్రవహిస్తుంది, ఇది ప్రపంచ పర్యాటకులకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

ఆ కాలంలో ఎత్తైన పిరమిడ్‌లు ఎలా నిర్మించబడ్డాయి? అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఈజిప్టు పిరమిడ్ల రహస్యాన్ని తెలుసుకోవడానికి చాలా కాలంగా పరిశోధనలు జరుగుతున్నాయి. ఇందుకోసం వివిధ యూనివర్సిటీల శాస్త్రవేత్తలు, రీసెర్చ్ స్కాలర్లు తమ విలువైన సమయాన్ని వెచ్చిస్తున్నారు. అయినా ఎలాంటి పురోగతి లేదు. అయితే ఇది ఎప్పటికీ ఛేదించలేని మిస్టరీగా మిగిలిపోతుందా? అంటే లేదు. తాజాగా జరిగిన ఓ పరిశోధన అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది. పిరమిడ్ల వెనుక ఉన్న గుట్టు త్వరలో విడుదల కానుందని తెలుస్తోంది. ఈ విషయంలో అమెరికా శాస్త్రవేత్తలు ఓ అడుగు ముందుకేశారు.

విల్మింగ్టన్‌లోని యూనివర్సిటీ ఆఫ్ నార్త్ కరోలినాకు చెందిన శాస్త్రవేత్తలు ఈజిప్షియన్ పిరమిడ్‌లకు సంబంధించిన విషయాన్ని కనుగొన్నారు. నైలు నదికి ఉపనది ఉన్నట్లు గుర్తించారు. ఉపనది ఈజిప్షియన్ పిరమిడ్లలో ఒకటైన గిజా పిరమిడ్ ప్రక్కనే ప్రవహిస్తుందని అంచనా వేయబడింది. కానీ ఈ ఉపనది కనిపించదు. ఈ నదిని ఇసుక తిన్నెలు కప్పినట్లు శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడైంది. బహుశా ఈ నది సహాయంతో పిరమిడ్లు నిర్మించబడి ఉంటాయని యూనివర్సిటీ పరిశోధకులు ఊహిస్తున్నారు. ఈ మేరకు వారు ఒక అధ్యయనాన్ని ప్రచురించారు.

* అరమత్ యొక్క ఉపనది

ఈజిప్టు పిరమిడ్లు మరియు నైలు నది మధ్య లింక్ ఉందని శాస్త్రవేత్తలు చాలా కాలంగా విశ్వసిస్తున్నారు. అందుకు అనుగుణంగా పరిశోధనలు జరుగుతున్నాయి. వందల ఏళ్లుగా సాగుతున్న పరిశోధనలో ఎట్టకేలకు నేడు ఓ ముందడుగు పడింది. యూనివర్శిటీ ఆఫ్ నార్త్ కరోలినా శాస్త్రవేత్తలు నైలు నది నుండి ఈజిప్షియన్ పిరమిడ్‌ల వైపు ప్రవహిస్తున్నట్లు కనుగొన్నారు. శాస్త్రవేత్తలు ఈ ఉపనదిని అరమత్ గా గుర్తించారు. ఈ ఉపనది ప్రసిద్ధ గిజా పిరమిడ్‌తో పాటు మరో 31 పిరమిడ్‌ల వెంట ప్రవహించిందని అధ్యయనం వెల్లడించింది. ఉపనది దాదాపు 40 మైళ్ల వరకు విస్తరించి ఉందని పేర్కొంది.

* భారీ వస్తువుల రవాణా?

అరమత్ అంటే అరబిక్ భాషలో ‘పిరమిడ్’. వివిధ దేశాలకు చెందిన శాస్త్రవేత్తలు పిరమిడ్‌ల రాడార్‌ శాటిలైట్‌ మ్యాప్‌ ఫోటోలను విశ్లేషించగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. పిరమిడ్ల నిర్మాణానికి అవసరమైన భారీ సామాగ్రి ఈ అరమాట్ ద్వారా రవాణా చేయబడుతుందని అంచనా. పిరమిడ్ల నిర్మాణం ఎలా సాగిందన్న దానిపై ఓ అంచనాకు వచ్చే అవకాశం ఉందన్నారు. అంతేకాకుండా, ఈ ఉపనది ఈజిప్షియన్ల పురాతన రాజధాని మెంఫిస్ గుండా ప్రవహిస్తుంది.

* స్పష్టత లేకపోవడం

అరమత్ నది జాడలను గుర్తించినప్పటికీ, దీనిపై స్పష్టత లేదని పరిశోధన బృందం లీడ్ వెల్లడించింది. అరమత్ పొడవు, పరిమాణం, పరివాహక ప్రాంతం, సామీప్యతపై కచ్చితమైన స్పష్టత లేదని చెప్పారు. అయితే, శాస్త్రవేత్తలు నైలు నది లోయలో 3,700 మరియు 4,700 సంవత్సరాల క్రితం 31 పిరమిడ్‌లను నిర్మించారని, అదే సమయంలో అరమత్ ఉపనది కూడా ఉండి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.