సోమవారం ఈ జిల్లాలలో స్కూల్స్ కి సెలవు ప్రకటించిన ప్రభుత్వం.. అక్కడ మాత్రం విద్యార్థులకే సెలవు..
తీవ్ర అల్పపీడన ప్రభావం వల్ల కోస్తా ఆంధ్ర అంతటా భారీ వర్షాలు కురుస్తున్నాయి.. సముద్రం అల్లకల్లోలం గా ఉంది.. అల్పపీడనం వాయువ్య దిశగా ప్రయాణించి ఛత్తీస్ గడ్ వైపు బలహీన పడే అవకాశం ఉంది..
సముద్ర తీరం వెంబడి గంటకు 45 – 55 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీయనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. వాయుగుండం ప్రభావంతో ఇంకా 3 రోజుల పాటు ఈదురుగాలులతో కూడిన భారీవర్షాలు కురిసే అవకాశం ఉంది.
Related News
తీవ్ర వర్షాల కారణం గా గోదావరి నది ఉదృతి అధికం గా ఉంది.. గోదావరి నీటిమట్టం ఆందోళన కరంగా ఉంది.. ఈ నేపథ్యం లో పలు జిల్లాలు పాఠశాలలకు సోమవారం కూడా సెలవు ప్రకటించాయి.
అంబేడ్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరు జిల్లా పూర్తి గ అన్ని యాజమాన్య పాఠశాలలకు సెలవు ప్రకటించారు.. తూర్పు గోదావరి జిల్లా లోని కొవ్వరు డివిజన్ లోని పాఠశాలల కు మాత్రమే జిల్లా కలెక్టర్ విద్యార్థులకు మాత్రం సెలవు ప్రకటించి టీచర్ లను మాత్రం పాఠశాలలకు హాజరు కావాలని ఆదేశించారు.. మరియు ఈ సెలవుని రాబోవు రోజుల్లో మరొక సెలవు దినాన పని చేయాలనీ ఆదేశించారు..