ఇటీవల హీరోయిన్లు గ్లామర్ పాత్రలకే కాదు.. డీ గ్లామరైజ్డ్ పాత్రలకు కూడా ఓకే చెబుతున్నారు.
స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకోవాలంటే.. అన్ని పాత్రలకు ఓకే చెప్పాలి. ఇక కామాక్షి భాస్కర్ల ఈ కోవకు చెందినవారే. ఈ నటి తన కెరీర్‌లో ఎక్కువగా డి-గ్లామరస్ పాత్రలు చేసింది. ఆ పాత్రలకు అవార్డులు కూడా అందుకుంది. తెరపై డీ-గ్లామరస్, రగ్గడ్ క్యారెక్టర్స్ లో కనిపిస్తూ.. సోషల్ మీడియాలో మాత్రం ప్రకంపనలు సృష్టిస్తోంది ఈ చిన్నది.
చైనాలో డాక్టరేట్ పట్టా అందుకున్న ఈ సుందరి.. కొంతకాలం అపోలో ఆస్పత్రిలో డాక్టర్ గా పని చేసింది. 2018లో మిస్ తెలంగాణ టైటిల్ గెలుచుకున్న ఆమెకు.. ఆ తర్వాత వరుస సినిమా ఛాన్సులు వచ్చాయి. ‘ప్రియురాలు’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ‘మా ఊరి పొలిమేరా’, ‘ఇట్లు మారేడు మిల్లి ప్రజానీకం’, ‘విరూపాక్ష’, ‘పొలిమెర 2’, ‘ఓం భీమ్ బుష్’ వంటి చిత్రాల్లో ఆమె కీలక పాత్రల్లో కనిపించారు. మా ఊరి పొలిమేరా, పొలిమేర 2 సినిమాలు ఈ బ్యూటీకి మంచి పేరు తెచ్చిపెట్టాయి.
మరోవైపు, ఆమె ‘ఝాన్సీ’, ‘సైతాన్’, ‘దూత’ వంటి వెబ్ సిరీస్‌లలో కూడా నటించింది. సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలతో కుర్రాళ్లను పిచ్చెక్కిస్తూనే ఉంటుంది ఈ భామ. ఆలస్యమెందుకు? ఆ ఫోటోలపై ఓ లుక్కేయండి.