CHILD DIED: బాలుడి ప్రాణం తీసిన బాటిల్ మూత..

కూల్ డ్రింక్ బాటిల్ నోట్ల పెట్టుకొని ఆడుకుంటుండగా మూత గొంతులో ఇరుక్కుపోయి ఒక బాలుడు మృతి చెందాడు. ఈ సంఘటన మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటలో జరిగింది. లక్షెట్టిపేట మునిసిపాలిటీలోని 9వ వార్డుకు చెందిన గడికొప్పుల సురేందర్ అనే బాలుడు ఆదివారం సాయంత్రం కొమ్ముగూడంలోని తన బంధువుల ఇంట్లో జరిగిన కార్యక్రమానికి తన భార్య, కుమార్తె, కుమారుడు రుద్రయన్ (9 నెలల వయస్సు)తో కలిసి వెళ్లాడని ఎస్ఐ సతీష్ తెలిపారు. ఈ క్రమంలో రుద్రయన్ నోటిలో కూల్ డ్రింక్ బాటిల్ మూత పెట్టుకుని ఆడుకుంటుండగా అది గొంతులో ఇరుక్కుపోయింది. తన కొడుకు ఊపిరి ఆడక ఇబ్బంది పడుతుండగా, తల్లిదండ్రులు నోటి నుండి మూతను తీసి వెంటనే స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుండి మంచిర్యాల తీసుకెళ్లగా, అక్కడి వైద్యులు అతన్ని పరీక్షించి చనిపోయినట్లు ప్రకటించారు. కొడుకు మృతి చెందాడని తల్లిదండ్రులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now