Cast: Naga Chaitanya, Sai Pallavi, Prithvi Raj, Prakash Belawadi, Kalpa Latha and others
Production Company: Geetha Arts
Producers: Bunny Vasu, Allu Aravind
Story: Karthik Theeda
Director-Screenplay: Chandoo Mondeti
Music: Devi Sri Prasad
Cinematography: Shamdutt Sainudeen
Release: February 7, 2025
సంక్రాంతి సినిమాల సందడి తర్వాత బాక్సాఫీస్ వద్ద విడుదలవుతున్న పెద్ద సినిమా ‘తండేల్’ కావడంతో బజ్ బాగానే క్రియేట్ అయింది. ‘లవ్ స్టోరీ’ చిత్రంతో మంచి విజయం చూసిన నాగ చైతన్యకు ఆ తర్వాత సరైన హిట్ పడలేదు. విడుదలైన కస్టడీ కూడా అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. ఇండస్ట్రీలో సరైన హిట్ కోసం గత ఐదేళ్లుగా నాగచైతన్య సమయంలో దర్శకుడు చందూ మొండేటితో ‘తండేల్’ కథ సెట్ అయింది. కార్తికేయ 2 విజయంతో పాన్ ఇండియా రేంజ్‌లో ఆయనకు గుర్తింపు దక్కింది. ఆ మూవీ తర్వాత ప్రాజెక్ట్ ఇదే కావడంతో వీరిద్దరి కాంబినేషన్‌లో తప్పకుండా విజయాన్ని సాధిస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు.
వాస్తవ ఘటనల స్ఫూర్తితో ‘తండేల్’ స్టోరీని చూపించనున్నారు. ఈ కథలో సాయి పల్లవి ఎంపిక కూడా సినిమాపై మరింత బజ్ క్రియేట్ చేసింది. ఆపై ఈ మూవీ నుంచి విడుదలైన పాటలు, ట్రైలర్ భారీ అంచనాలు పెరిగాయి. దానికి తోడు ప్రమోషన్స్ కూడా ఆఖరులో పెంచేశారు. జనాల్లోకి తండేల్ చొచ్చుకుపోయాడు. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది..? నాగచైతన్య, చందూ మొండేటి ఖాతాలో బిగ్ హిట్ పడిందా..? రివ్యూలో చూద్దాం.
కథేంటంటే..
శ్రీకాకుళం జిల్లాకు చెందిన 22 మంది మూడు బోట్లలో గుజరాత్ వెరావల్ నుంచి బయలుదేరి చేపల వేట సాగిస్తుండగా పొరపాటున పాకిస్థాన్ ప్రాదేశిక జలాల్లోకి వారు ప్రవేశించారు. అప్పుడు పాక్ వారిని అరెస్ట్ చేసి జైల్లో వేస్తుంది. తండేల్ కథకు ఇదే మూలం.. డి.మత్స్యలేశం గ్రామం నుంచే తండేల్ కథ మొదలౌతుంది. రాజు (నాగచైతన్య), సత్య (సాయి పల్లవి) ప్రేమికులుగానే మనకు పరిచయం అవుతారు. ప్రాణాలకు ఎదురీదుతూ సముద్రంలోకి వెళ్లిన మత్స్యకారులు సురక్షితంగా తిరిగొస్తారనే నమ్మకం ఉండదు. వారు ఎప్పుడైతే తమ ఇంటికి చేరుతారో అప్పుడే కుటుంబ సభ్యులు ఊపిరిపోసుకుంటారు. ఇదే పాయింట్ సత్యలో భయం కలిగించేలా చేస్తుంది. తను ప్రేమించిన రాజు చేపల వేట కోసం సముద్రంలోకి వెళ్తే.. ఏదైనా ప్రమాదం జరగాలంటే అతన్ని వేటకు వెళ్లొద్దంటూ ఆమె నిరాకరిస్తుంది.
ఇప్పటికే తండేల్ (నాయకుడు)గా ఉన్న రాజు.. సత్య మాటను కాదని వేట కోసం గుజరాత్ వెళ్తాడు. ఇక్కడ నుంచి అసలు కథ మొదలౌతుంది. సాధారణ కూలీగా ఉన్న రాజు తండేల్ ఎలా అయ్యాడు..? వేటకు వెళ్లొద్దని సత్య చెప్పినా కూడా రాజు గుజరాత్‌కు ఎందుకు వెళ్తాడు..? ఈ కారణంతో తన పెళ్లి విషయంలో ఆమె ఎలాంటి నిర్ణయం తీసుకుంది..? అందుకు ఎదురైన కారణం ఏంటి..? వేటకు వెళ్లిన వారందరూ పాక్ చెరలో ఎలా చిక్కుకుంటారు..? రాజు మీద కోపం కనిపించే వారందరినీ తిరిగి ఇండియాకు రప్పించేందుకు సత్యం చేసిన పోరాటం ఏంటి..? చివరగా రాజు, సత్య కలుసుకుంటారా..? అనేది తెలియాలంటే థియేటర్‌కు వెళ్లి ‘తండేల్’ కథ పూర్తిగా తెలుసుకోవాలి.
ఎలా ఉందంటే
చందూ మొండేటి దర్శకత్వం నుంచి వచ్చిన సినిమాలన్నీ కూడా ప్రేక్షకులకు ప్రత్యేకంగా ఉంటాయి. నాగ చైతన్యతో ప్రేమమ్, సవ్యసాచి చిత్రాలను తెరకెక్కించడంతో వారిద్దరి మధ్య బ్యాండింగ్ ఉంది. అయితే, కార్తికేయ2 సినిమా తర్వాత ఒక బలమైన కథతో దర్శకుడు వచ్చాడు. అందుకు తగ్గట్లుగానే ఒక టీమ్‌ను రెడీ చేసుకుని తండేల్ బరిలోకి ఇద్దరూ దిగారు. అనకున్నట్లుగానే తండేల్ కోసం సాయి పల్లవి, నాగచైతన్య, దేవిశ్రీప్రసాద్, సినిమాటోగ్రఫీ షామ్‌దత్ సాయినుదీన్ నాలుగు పిల్లర్లుగా నిలబడ్డారు. శ్రీకాకుళం మత్స్యకారుడిగా నాగ చైతన్య ఇరగదీశాడని చెప్పవచ్చు. తాండేల్ సినిమాతో అక్కినేని ఫ్యాన్స్ కాలర్ ఎగరేసుకుని తిరొగచ్చు అనేలా ఉంది. కార్తీక్ తీడ అందించిన కథకు చందు మొండేటి తనదైన స్టైల్లో భారీ ఎమోషనల్ టచ్ ఇచ్చారు. అందుకే చాలామందికి కనెక్ట్ అయ్యారు.
ఈ సినిమా నేపథ్యం ఇద్దరి ప్రేమకుల మధ్యనే కొనసాగుతుంది. ప్రియుడికి ఏమైనా అవుతుందేమోననే భయం ప్రియురాలిలో ఆందోళన మొదలౌతుంది. ఆ సమయంలో ఆమె పడే తపన, మానసిక సంఘర్షణ ఎలా ఉంటుందో చూపించడంలో దర్శకుడు పూర్తిగా సక్సెస్ అయ్యాడు. కథలో ఇది పని అని మనం అంచనా వేస్తున్నప్పటికీ వారి మధ్య వచ్చే భావోద్వేగభరితమైన సీన్లు ప్రేక్షకుడిని కట్టిపడేస్తాయి.
ఎక్కడా కూడా కథలో సాగదీతలు లేకుండా సింపుల్‌గానే దర్శకుడు ప్రారంభిస్తాడు. హీరో, హీరోయిన్ల ఆపై వారిద్దరి మధ్య ఉన్న బాండింగ్ ప్రతి ప్రేమికులకు పరిచయం అయ్యేలా ఉంటుంది. క్షణం కూడా ఒకరినొకరు విడిచి ఉండలేని పరిస్థితిలో వారు ఉంటారు. అలాంటి సమయంలో కొంత కాలం ఎడబాటు ఏర్పడితే.. ఆ ప్రేమికుల మధ్య సంఘర్షణ ఎలా ఉంటుందో చాలా ఎమోషనల్‌గా దర్శకుడు చూపించాడు. అందుకు తోడు దేవిశ్రీ ఇచ్చిన మ్యూజిక్ కథను మరో లెవల్‌కు తీసుకెళ్తాయి.
చిత్ర యూనిట్ మొదటి నుంచి ఇదొక అద్భుతమైన లవ్‌స్టోరీ అంటూ చెప్పారు. వారు చెప్పినట్లుగా ప్రేమికులు అందరూ ఈ కథకు కనెక్ట్ అవుతారు. సినిమా ఫస్ట్ కార్డ్‌లోనే రాజు వద్దని చెప్పిన సత్య.. మరో పెళ్లి చేసుకుంటానని తన తండ్రితో చెబుతుంది. ఆమె అలా చెప్పడానికి కారణం ఏంటి అనేది ఫస్టాఫ్‌లో తెలుస్తుంది. ఇక సెకండాఫ్‌లో పాకిస్తాన్ జలాల్లోకి తండేల్ టీం వెళ్లడం.. అక్కడ వారు పాక్‌కు చిక్కడంతో జైలు జీవితం మొదలౌతుంది. అక్కడ వారి జైలు జీవితం ఎంత దారుణంగా ఉందో మన కళ్ళకు కట్టినట్లు దర్శకుడు చూపించడంలో విజయం సాధించాడు. కానీ, కథ మొత్తంలో పాకిస్తాన్ ట్రాకే మైనస్ అని కూడా చెప్పవచ్చు. సెకండాఫ్ అక్కడక్కడ కాస్త స్లో అయినట్లు ఉంటుంది. గత చిత్రాలను మనకు గుర్తు చేస్తూ కొంచెం చిరాకు తెప్పిస్తాయి.