TG TET 2025 Result Date: తెలంగాణ TET ఫలితాల తేదీ ఇదే.. !

తెలంగాణ TET 2025 జవాబు కీ ఇటీవలే విడుదల అయిన విషయం తెలిసిందే. జవాబు కీపై అభ్యంతరాల స్వీకరణ కూడా ప్రారంభమైంది. తరువాత, తుది కీని తయారు చేసి విడుదల చేస్తారు. తరువాత, TET ఫలితాలను విడుదల చేస్తారు. TET ఫలితాల విడుదల తేదీని విద్యా శాఖ ఇటీవల ప్రకటించింది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

హైదరాబాద్, జనవరి 26: తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TET) పరీక్షలు ఇటీవల ముగిసిన విషయం తెలిసిందే. ఈ పరీక్షలకు సంబంధించిన ప్రాథమిక కీ ఇటీవలే విడుదలైంది. జనవరి 2 నుండి 20 వరకు జరిగిన ఆన్‌లైన్ TET పరీక్షలను మొత్తం 10 రోజుల పాటు 20 సెషన్లలో నిర్వహించిన విషయం తెలిసిందే.

తెలంగాణ టెట్ పరీక్షల ఫలితాలను ఫిబ్రవరి 5న విడుదల చేస్తామని పాఠశాల విద్యా శాఖ ప్రకటించింది. రేవంత్ సర్కార్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, టెట్ పరీక్షను సంవత్సరానికి రెండుసార్లు నిర్వహిస్తామని, ఖాళీగా ఉన్న బోధనా పోస్టులను ప్రతి సంవత్సరం డీఎస్సీ ద్వారా ఎప్పటికప్పుడు భర్తీ చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే.

Related News

ఈ మేరకు గత సంవత్సరం అధికారం చేపట్టినప్పటి నుంచి వరుసగా రెండుసార్లు డీఎస్సీతో పాటు టెట్‌ను నిర్వహించింది. ఈ మేరకు 2024-25 సంవత్సరానికి సంబంధించిన జాబ్ క్యాలెండర్‌ను ఆగస్టులో విడుదల చేశారు. జాబ్ క్యాలెండర్‌లో ప్రకటించినట్లుగానే 2024లో రెండో టెట్‌ను నిర్వహించారు. డీఎస్సీ నోటిఫికేషన్‌ను 2025 ఫిబ్రవరిలో విడుదల చేసి, ఏప్రిల్‌లో పరీక్ష నిర్వహిస్తామని తెలంగాణ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్‌లో ప్రకటించింది. అయితే, అంతకు ముందే ఎస్సీ వర్గీకరణ అంశంపై స్పష్టత వస్తే, నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉంది. వర్గీకరణ పూర్తి కాకపోతే, డీఎస్సీ ప్రకటన ఎప్పుడు వస్తుందో స్పష్టంగా తెలియదు.

మరోవైపు, ఎస్సీ వర్గీకరణ అంశంపై స్పష్టత వచ్చే వరకు ఉద్యోగ ప్రకటనలు జారీ చేయడం కష్టమనే అభిప్రాయం విద్యా వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. తదుపరి డీఎస్సీలో సుమారు 6 వేల పోస్టులను భర్తీ చేస్తామని సంబంధిత ప్రభుత్వ వర్గాలు ఇప్పటికే అనేకసార్లు ప్రకటించిన విషయం తెలిసిందే.