పెద్ద శబ్ధంతో రియాక్టర్ పేలడంతో కార్మికులు భయంతో బయటకు పరుగులు తీశారు. రియాక్టర్ పేలిన వెంటనే అప్రమత్తమైన కంపెనీ యాజమాన్యం వెంటనే ఎమర్జెన్సీ సైరన్ మోగించింది. ప్రమాదవశాత్తు పేలుడు పదార్థాలు పేలడంతో భవనం కుప్పకూలింది.
జిల్లాలోని యాదగిరిగుట్ట మండలం పెద్ద కందుకూరులో భారీ పేలుడు సంభవించింది. ప్రీమియర్ ఎక్స్‌ప్లోజివ్‌లోని కంపెనీలో రియాక్టర్ పేలింది. పెద్ద శబ్ధంతో రియాక్టర్ పేలడంతో కార్మికులు భయంతో బయటకు పరుగులు తీశారు. రియాక్టర్ పేలిన వెంటనే అప్రమత్తమైన కంపెనీ యాజమాన్యం ఎమర్జెన్సీ సైరన్ మోగించింది. ప్రమాదవశాత్తు పేలుడు పదార్థాలు పేలడంతో భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో ఓ కార్మికుడు మృతి చెందగా… ఎనిమిది మందికి గాయాలయ్యాయి. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.
క్షతగాత్రులను వెంటనే 108లో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మంటలు అదుపులోకి వచ్చాయి. ఈ ఉదయం ప్రీమియర్ ఎక్స్‌ప్లోజివ్ డిటోనేటర్ ప్లాంట్‌లో అకస్మాత్తుగా పేలుడు సంభవించింది. పేలుడు పదార్థాల తాకిడికి భవనం కూడా కూలిపోయింది. కనకయ్య, ప్రకాష్ అనే ఇద్దరు కూలీల పరిస్థితి విషమంగా ఉంది. మొత్తం ఎనిమిది మంది కూలీలు తీవ్రంగా గాయపడ్డారు.
క్షతగాత్రులను చికిత్స నిమిత్తం భువనగిరి ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ కనకయ్య అనే కార్మికుడు మృతి చెందాడు. మరో కార్మికుడు మొగిలిపాక ప్రకాష్ పరిస్థితి విషమంగా ఉండడంతో వెంటనే సికింద్రాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. గతంలో ఈ కంపెనీలో పేలుడు తాకిడికి ఓ కార్మికుడు మృతి చెందినట్లు తెలుస్తోంది. ఇప్పుడు తాజాగా పెద్ద ఎత్తున పేలుడు సంభవించింది. దీంతో కార్మికులు ప్రాణభయంతో కంపెనీ నుంచి బయటకు పరుగులు తీశారు.