Mahindra 3XO: 7.99 లక్షలకే 5 స్టార్ సేఫ్టీ + ADAS + 360 కెమెరా…

ఇది 4 మీటర్ల సబ్‌కాంపాక్ట్ SUV కేటగిరీలో లాంచ్ అయింది. ఇందులో Level-2 ADAS, 360 డిగ్రీ కెమెరా, 5 స్టార్ సేఫ్టీ, మరియు ఇంకా ఎన్నో స్మార్ట్ ఫీచర్లు ఉన్నాయి. బెస్ట్ బడ్జెట్‌లో లగ్జరీ కార్ అనిపించేటంతటి ఫీచర్లు ఇందులో దొరుకుతాయి. మొదటి సారి కారు కొనుగోలు చేయాలనుకునే వాళ్లకు ఇది బెస్ట్ ఆప్షన్.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

సేఫ్టీ, ఇంటీరియర్, బిల్ట్ క్వాలిటీ – అంతా బెస్ట్

Mahindra 3XO గ్లోబల్ NCAP & భారత్ NCAPలో **5 స్టార్ రేటింగ్** పొందింది. కారు డోర్ మూసినప్పుడు వచ్చే “థడ్” శబ్దమే బిల్ట్ క్వాలిటీని తెలియజేస్తుంది. అంతేకాక, ఇంటీరియర్లు చాలా ప్రీమియంగా ఉంటాయి. గ్యాప్‌లను తగ్గించి, మెటీరియల్స్‌ను ప్రీమియంగా మార్చారు. అర్ధం కావాలి అంటే – ఇది ఫీచర్ల పరంగా Hyundai, Kia లాంటి కంపెనీలను కూడా టచ్ చేస్తోంది!

ఫీచర్ల లెక్క వేసుకుంటే… ఇది SUV కాదు, స్మార్ట్ మిషన్

Related News

Level 2 ADAS (Automatic braking, lane assist వంటి ఫీచర్లు). 360 డిగ్రీ కెమెరా – పార్కింగ్ ఇక చిల్లర! ఐదు స్టార్ గ్లోబల్ సేఫ్టీ. ఫుల్ డిజిటల్ క్లస్టర్ + టచ్ స్క్రీన్. వాయిస్ కమాండ్ & కనెక్టెడ్ కార్ టెక్నాలజీ

పవర్‌పుల్ ఇంజిన్ – జెట్‌లా పోతుంది

ఈ SUVలో 1197cc టర్బో పెట్రోల్ ఇంజిన్ ఉంది. ఇది 128bhp పవర్ మరియు 230Nm టార్క్ అందిస్తుంది. మీకు పికప్ గానీ, స్మూత్ డ్రైవ్ గానీ కావాలంటే – ఇది మిస్సవ్వకూడదు. పైగా, పెట్రోల్, డీజిల్ రెండింట్లోనూ అందుబాటులో ఉంది.

మైలేజ్‌కి సంబంధించి కూడా షాక్‌కే గురిచేస్తుంది

Mahindra 3XO మైలేజ్ సగటుగా 18–19 kmpl వరకు ఇస్తుంది. మీరు 80 కిలోమీటర్ల స్పీడ్‌తో డ్రైవ్ చేస్తే మైలేజ్ మరింత పెరుగుతుంది. డీజిల్ వేరియంట్లు మైలేజ్ పరంగా మరింత అద్భుతం.

ధరకీ, ఫీచర్లకీ మధ్య వార్ మొదలవుతుంది!

Mahindra 3XO ధరలు రూ.7.99 లక్షల నుంచి రూ.15.56 లక్షల వరకు ఉన్నాయి (ఎక్స్ షోరూమ్). బేస్ మోడల్‌కి కొన్ని ఫీచర్లు రాకపోయినా, పవర్, స్టైల్, లుక్స్ పరంగా అది కూడా పర్‌ఫెక్ట్ SUV లా కనిపిస్తుంది. కానీ నిజమైన FOMO క్రియేట్ చేసే ఫీచర్లు – ADAS, 360 కెమెరా వంటివి టాప్ వేరియంట్లలోనే ఉంటాయి.

Mahindra 3XO ఇప్పుడే బుక్ చేసుకోకపోతే… తరువాత వేరే వేరియంట్‌తో సర్దుకోవాల్సి రావొచ్చు! లగ్జరీ, సేఫ్టీ, టెక్నాలజీ – ఇవన్నీ ఒకే కార్‌లో కావాలంటే… మీకు ఇంకా ఆలోచించాల్సిన అవసరం లేదు.
బుకింగ్ మొదలు – ఫ్యూచర్ డ్రైవ్ Mahindra 3XOతోనే మొదలు!