తెలంగాణ ప్రభుత్వం మరో కీలక ప్రకటన విడుదల చేసింది. రేపు గిరిజనులకు ప్రత్యేక సెలవు ప్రకటించింది. గిరిజన దైవం సేవాలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా ఫిబ్రవరి 15న సెలవు ప్రకటించింది.
రాష్ట్రంలోని గిరిజన ఉద్యోగులకు ప్రత్యేక క్యాజువల్ సెలవులు రేపు ఇవ్వనున్నట్లు ఆదేశించింది. ఈ ఉత్తర్వులు అన్ని ప్రభుత్వ శాఖల్లోని బంజారా ఉద్యోగులకు వర్తిస్తాయని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తన ఉత్తర్వులో పేర్కొన్నారు.
అయితే, గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు సేవాలాల్ మహారాజ్ జయంతిని సెలవు దినంగా ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా అనేక గిరిజన సంఘాలు ఇప్పుడు కూడా సెలవు దినంగా ప్రకటించాలని సీఎం రేవంత్ రెడ్డికి పెద్ద ఎత్తున అభ్యర్థనలు పంపాయి.
Related News
ఈ క్రమంలో సేవాలాల్ జయంతిని ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించకుండా క్యాజువల్ సెలవు మాత్రమే మంజూరు చేశారు. ప్రభుత్వ సెలవు దినానికి బదులుగా క్యాజువల్ సెలవును అందించడం పట్ల గిరిజన వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి, అందుకే బంజారా గిరిజనులకు మాత్రమే సెలవులు మంజూరు చేశారు.