TG 10th Supply Exam Schedule: తెలంగాణ పదో తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్‌ వచ్చేసింది..!!

తెలంగాణ రాష్ట్ర 10వ తరగతి ఫలితాలు ఏప్రిల్ 30న విడుదలైన విషయం తెలిసిందే. ఇందులో ఫెయిల్ అయిన విద్యార్థులకు, తక్కువ మార్కులు సాధించిన విద్యార్థులకు అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణ షెడ్యూల్‌ను ప్రభుత్వ పరీక్షల విభాగం ఇటీవల విడుదల చేసింది. తాజా షెడ్యూల్ ప్రకారం, జూన్ 3 నుండి సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభమవుతాయి. ఈ పరీక్షలు జూన్ 3 నుండి జూన్ 13 వరకు కొనసాగుతాయి. ఆయా తేదీల్లో ఉదయం 9.30 నుండి మధ్యాహ్నం 12.30 వరకు పరీక్షలు నిర్వహించబడతాయి.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

సప్లిమెంటరీ పరీక్షలు రాసే విద్యార్థుల దరఖాస్తు ప్రక్రియ కూడా ఇప్పటికే ప్రారంభమైంది. విద్యార్థులు ఎటువంటి ఆలస్య రుసుము లేకుండా మే 16 వరకు ఫీజు చెల్లించవచ్చు. 10వ తరగతి పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులందరూ ఈ పరీక్షలు రాయవచ్చు. ప్రతి సబ్జెక్టుకు రీకౌంటింగ్ కోసం రూ. 500 మరియు రీ-వెరిఫికేషన్ కోసం రూ. 1000 చెల్లించి కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇది మే 15 వరకు సాధ్యమవుతుంది. రీకౌంటింగ్ మరియు రీ-వెరిఫికేషన్ ఫలితాల కోసం వేచి ఉండకుండా సప్లిమెంటరీ పరీక్షలు రాయాలని బోర్డు విద్యార్థులకు సూచించింది. ఈ సంవత్సరం, తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 5,07,107 మంది విద్యార్థులు 10వ తరగతి పరీక్షలకు హాజరయ్యారు, వారిలో 4,60,519 మంది (92.78 శాతం) ఉత్తీర్ణులయ్యారు.

2025లో 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ ఇది
జూన్ 3వ తేదీ – ఫస్ట్ లాంగ్వేజ్ (గ్రూప్-ఎ), ఫస్ట్ లాంగ్వేజ్ పార్ట్ 1, 2 (కాంపోజిట్ కోర్సు)
జూన్ 4వ తేదీ – సెకండ్ లాంగ్వేజ్ పరీక్ష
జూన్ 5వ తేదీ – థర్డ్ లాంగ్వేజ్ పరీక్ష
జూన్ 6వ తేదీ – మ్యాథ్స్ పరీక్ష
జూన్ 9వ తేదీ – ఫిజికల్ సైన్స్ పరీక్ష
జూన్ 10వ తేదీ – బయోలాజికల్ సైన్స్ పరీక్ష
జూన్ 11వ తేదీ – సోషల్ స్టడీస్ పరీక్ష
జూన్ 12వ తేదీ – OSSC మెయిన్ లాంగ్వేజ్ పేపర్ 1 పరీక్ష
జూన్ 13వ తేదీ – OSSC మెయిన్ లాంగ్వేజ్ పార్ట్ 2 పరీక్ష

Related News