సాధారణం గా టీచర్ లకు వివిధ రకాల సెలవులు గవర్నమెంట్ మంజూరు చేసింది.. అయితే సెలవు కాలాన్ని బట్టి మంజూరు చేసే అధికారి మరియు అధికారాలు మారుతూ ఉంటాయి..
విద్యాశాఖలో వివిధ రకాల సెలవుల మంజూరు,రిపోర్టింగ్,రిపోస్టింగ్ ఉత్తర్వులు ఇచ్చే అధికారుల కాలపరిమితిని నిర్ణయిస్తూ ఉత్తర్వులు అనేకం గతంలో ఇవ్వబడినవి. సవరణ ఉత్తర్వులు రానంత వరకు అదే ఉత్తర్వులు చలామణి లో ఉన్నట్టే భావించాలి ..
సెలవులు ఇచ్చే అధికారం ఎవరికి ఉంది.. ఏ ఏ సెలవులు ఎంత పరిమితి తో ఏ అధికారి మంజూరు చేయవచ్చును. సంబంధిత అధికారిక ఉత్తర్వులు ఏమిటి ఇలాంటి వివరాలు ఈ పోస్ట్ లు తెలుసుకుందాం.
Related News
సెలవులు మీద ఇచ్చిన ఆర్డర్స్
(G.O.Ms.No.58,Edn తేది:22-04-2008) (G.O.Ms.No.70,Edn తేది:07-07-2009) Download
PS & UPS ప్రధానోపాధ్యాయులు ఏ సెలవులు మంజూరు చేయవచ్చు :
- పాఠశాలల్లోని సహోపాధ్యాయులకు 1. CL, 2. Spl.CL మంజూరు చేయు అధికారం కలదు
ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు (Gazetted Headmaster) ఏ సెలవులు మంజూరు చేయవచ్చు :
- పాఠశాలల్లోని సహోపాధ్యాయులకు 1.CL, 2.Spl.Cl, 3. CCL లతో పాటు 4 నెలల పరిమితితో ఇతర ఏ సెలవునైనా మంజూరు చేయవచ్చు.
మండల విద్యాధికారి(MEO) ఏ సెలవులు మంజూరు చేయవచ్చు:
- మండల పరిధిలోని PS, UPS ప్రధానోపాధ్యాయులకు 1.CL, 2.Spl.CL, 3.CCL మరియు ఉపాధ్యాయులందరికీ 4 నెలల పరిమితితో ఇతర ఏ సెలవునైనా మంజూరుచేస్తారు( Medical Leave, Halff pay leave, Maternity leave(120 Days), Paternity leave..e.t.c.)
జిల్లా ఉపవిద్యాధికారి (Dy.EO) ఏ సెలవులు మంజూరు చేయవచ్చు:
- హైస్కూల్ ప్రధానోపాధ్యాయులకు CL, Spl.CL, CCL లతో పాటు తన పరిధిలోని PS, UPS & HS ఉపాధ్యాయులందరికీ 6 నెలల వరకు ఇతర సెలవును మంజూరుచేస్తారు.
జిల్లా విద్యాశాఖాధికారి (DEO) ఏ సెలవులు మంజూరు చేయవచ్చు:
- Dy.Eo, MEO లకు CL, Spl.CL, CCL మంజూరు చేస్తారు. Dy.Eo, MEO, హైస్కూల్ ప్రధానోపాధ్యాయులతో పాటు ఉపాధ్యాయులందరికీ 6 నెలలకు పైబడి 1 సం॥ లోపు ఏ రకమైన సెలవునైనా మంజూరుచేస్తారు
పాఠశాల విద్యాశాఖ సంచాలకులు(DSE) ఏ సెలవులు మంజూరు చేయవచ్చు:
- మండల విద్యాధికారులకు, ప్రధానోపాధ్యాయులకు, ఉపాధ్యాయులకు 1 సం॥ పైబడి 4సం॥ వరకు ఏ రకపు సెలవునైనా పాఠశాల విద్యాశాఖ సంచాలకులు మంజూరు చేస్తారు. అంతకుమించిన కాలానికి సెలవు మంజూరు అధికారం ప్రభుత్వానికే ఉంటుంది.
ప్రసూతి సెలవు (Maternity Leave) సందర్భంలో..
- మహిళా ఉపాధ్యాయులకు 6 నెలల వరకు సెలవు మంజూరు చేయు అధికారం ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులకు, మండలంలో పనిచేస్తున్న మహిళా ఉపాధ్యాయులకు సెలవు మంజూరు అధికారం మండల విద్యాధికారులకు (MEO) లకు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీచేసారు. Download (G.O.Ms.No.84 తేది:17-09-2012) (Amendment to G.O.Ms.No.70 )
Maternity Leave extended up to 180 days (GOMS No 152 dt.04-05-2010)- Download GO
Paternity leave to male government employee (GOMS No.231 dt 16-09-2005) download
Clarification of paternity leave Download
Hysterectomy Leave (45days) G.O.Ms.No. 52 dt. 01-04-2011 download