Teacher Transfers 2025 update: పది రోజుల్లో టీచర్ల బదిలీలు, పదోన్నతులు..

పది రోజుల్లో టీచర్ల బదిలీలు, పదోన్నతులు, హైకోర్టు తీర్పు ప్రకారమే అంధుల టీచర్ల బదిలీలు, ఉపాధ్యాయ సంఘ నాయకులతో విద్యాశాఖ అధికారులు స్పష్టం

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

రాష్ట్ర వ్యాప్తంగా మే నెలలొ చేపట్టనున్న ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ పది రోజు రోజుల్లో ప్రారంభించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ అదనపు డైరెక్టర్ సుబ్బారెడ్డి తెలిపారు. ఉపాధ్యాయ సంఘాలతో శుక్రవారం ఆయన వర్చువల్గా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బదిలీలు, పదోన్నతుల అంశాలు చర్చకు వచ్చాయి. అంధుల ఉపాధ్యాయులు ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించన నేపథ్యంలో వారి బదిలీలపై కోర్టు స్టేటస్ కో ఇచ్చిన సంగతి విదితమే.

ఈ అంశాన్ని విద్యాశాఖ అధికారుల సమావేశంలో ఉపాధ్యా య సంఘ నేతలు మాట్లాడారు. హైకోర్టు తీర్పు నేపథ్యంలో మొత్తం బదిలీల ప్రక్రియ తాత్కాలికంగా నిలిచిపోతాయని ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్న తరుణంలో అలాంటిది ఏమీ ఉండదని విద్యాశాఖ అధికారులు స్పష్టం చేశారు.

Related News

అంధులైన ఉపాధ్యాయులు లాంగ్ స్టాండింగ్లో ఉన్న వారు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 658 మంది మాత్రమే ఉన్నారని, వారి వరకు కోర్టు ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకుంటామని అధికారులు చెప్పారు. ఇక సాధారణ బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ మరో పదిరోజుల్లో ప్రారంభం అవుతాయని ఉపాధ్యాయ సంఘ నేతలకు అధికారులు తెలిపారు.

వివిధ సంఘాల నాయకుల రిక్వెస్టులు ఇలా..

  • తెలుగు మీడియం, మైనర్ మీడియం ఉన్న ప్రాథమిక పాఠశాలలను యధాతథంగా కొనసాగించాలని అధికారు లను నాయకులు కోరారు.
  • సరీస్ గుర్తించి చూడకూడదని కోరారు.
  • ఫౌండేషన్ పాఠశాలల్లో 1:20 ప్రకారం పోస్ట్ లు చూపాలని, బేసిక్ పాఠశాలల్లో కనీసం ఇద్దరు టీచర్లు ఉండాలని అడిగారు.
  • మోడల్ ప్రాథమిక పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయుడిగా స్కూల్ అసిస్టెంట్లు కాకుండా, SGT లకు పదోన్నతులిచ్చి వారిని హెడ్మాస్టర్ చేయాలని కోరారు.
  • ఒకటి నుంచి 5 తరగతులను దూరంలోని హైస్కూల్ లకు తరలించకుండా ప్రాథమిక పాఠశాలల సమీపంలో ఉంచాలని డిమాండ్ చేశారు.
  • ఉన్నత పాఠశాలల్లో సమాంతర మీడియం కొనసాగించాలని, సెక్షన్కు 1:45గా పరిగణించాలని కోరారు.
  • యూపీ నుంచి అప్ గ్రేడ్ అవుతున్న అన్ని హైస్కూల్లో HM, PD లు కచ్చితంగా ఉండేలా చూడాలని అడిగారు.
  • తెలుగు, మైనర్ మీడియంలో సెలెక్ట్ అయిన ఉపాధ్యాయుల సీనియారిటీ లిస్ట్ మార్కులు, పుట్టిన తేదీ ఆధారంగా నిర్ణయించాలని సూచించారు.
  • ఏదైనా పాఠశాలలో జూన్, జులై, ఆగస్టు నెలల్లో రిటైర్ అవుతున్న ఆయా సబ్జెక్ట్ టీచర్లు ఉండే స్కూల్లలో రేషనలైజేషన్ పోస్టు SRUPLUS గా ఉంటే మినహాయింపు ఇవ్వాలని కోరారు.
  • రేషనలైజేషన్కు గురయ్యే ఉపాధ్యాయుల లో ఫిజెకల్లీ హ్యాండీక్యాప్డ్ ప్రిఫరెన్షియల్ ఉన్న వారికి, ఇటీవల సర్టిఫికేట్లను పొందలేని వారికి ఒకరోజు మెడికల్ బోర్డ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

ఉపాధ్యాయ సంఘాలు అడిగిన పలు అంశాలపై అధికారులు సానుకూలంగా స్పందించారని నాయకులు చెబుతున్నారు.