చంద్రబాబు ప్రమాణస్వీకారం తేదీలో మార్పు.. ముహూర్తం ఎప్పుడంటే

ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు ప్రమాణ స్వీకార తేదీలో మార్పు వచ్చింది. గతంలో జూన్ 9న ఏపీ కొత్త సీఎంగా ప్రమాణస్వీకారం చేయాలని నిర్ణయించారు.కానీ జూన్ 12న ప్రమాణస్వీకారం చేస్తానని తాజాగా ప్రకటించారు.ఏపీలో ఎన్డీయే కూటమి ఘనవిజయం సాధించింది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

జూన్ 4న ప్రకటించిన ఫలితాల్లో అపూర్వమైన మెజారిటీ సీట్లను గెలుచుకుంది. మొత్తం 175 సీట్లలో టీడీపీ – 136, జనసేన – 21, బిజెపి – 8 మొత్తం 165 సీట్లు గెలుచుకుని అతిపెద్ద రాజకీయ పార్టీగా అవతరించింది. అయితే టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు జూన్ 9న అమరావతిలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

అయితే అదే రోజున ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారం చేయడంతో గతంలో ప్రకటించిన తేదీని మార్చారు. జూన్‌ 12న విభజన ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా చంద్రబాబు రెండోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు.