TCS CEO Salary : Wow .. TCS CEO Salary ఎంతో తెలుసా? COO’s Salary తనకంటే ఎక్కువ..!

IT companies పనిచేస్తున్న సాధారణ ఉద్యోగుల వేతనాలే కాదు.. ఆయా companies managements కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న వారు కూడా భారీగానే వేతనాలు అందుకుంటున్నారు. దేశంలోని ప్రముఖ IT services సంస్థ Tata Consultancy TCS ) CEO Managing Director కె. కృతివాసన్ గత ఆర్థిక సంవత్సరంలో భారీ వేతనాన్ని అందుకున్నారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.25.4 కోట్ల వేతనం పొందారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Follow Us

అంటే నెల జీతం రూ.2 కోట్లకు పైగానే. కృతివాసన్ June 1, 2023న TCS యొక్క CEO మరియు MDగా బాధ్యతలు స్వీకరించారు. అంతకు ముందు, అతను April 1, 2023 నుండి May 31, 2023 వరకు కంపెనీకి బ్యాంకింగ్, ఆర్థిక సేవలు మరియు బీమా (BFSI) యొక్క గ్లోబల్ హెడ్గా ఉన్నారు. ఈ సేవలతో సహా , కృతివాసన్ June 1, 2023 నుండి March 31, 2024 వరకు CEO మరియు MDగా పనిచేసినందుకు రూ. 25.4 కోట్ల జీతం పొందారు.

వాస్తవానికి, కంపెనీ మాజీ CEO రాజేష్ గోపీనాథ్తో పోలిస్తే కృతివాసన్ జీతం తక్కువ. TCS సీఈఓగా ఉన్న రాజేష్ గోపీనాథ్ 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను 29.16 కోట్ల జీతం అందుకున్నారు.

ఇదిలా ఉండగా, TCS chief Operating Officer and Executive Director ఎన్ గణపతి సుబ్రహ్మణ్యం 2023-24 ఆర్థిక సంవత్సరానికి రూ. 26.18 కోట్ల జీతం అందుకున్నారు. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2023-24లో అతని జీతం 8.2 శాతం పెరిగింది. ఈ నెలలో పదవీ విరమణ చేయనున్నారు.

Salary hike of employees like this..
TCS వార్షిక నివేదికలోని వివరాల ప్రకారం, 2023-24 ఆర్థిక సంవత్సరంలో TCSలో పనిచేస్తున్న సగటు ఉద్యోగుల వేతనాలు 10.8 శాతం పెరిగాయి. ప్రస్తుతం TCS company rolls లో 6,01,546 మంది శాశ్వత ఉద్యోగులు ఉన్నారు. భారతదేశంలో TCS ఉద్యోగులకు సగటు వార్షిక జీతం పెరుగుదల 5.5 శాతం నుండి 8 శాతం వరకు ఉండగా, అత్యుత్తమ పనితీరు కనబరిచినవారు 10 శాతానికి పైగా జీతాల పెరుగుదలను పొందారు.

భారత్ వెలుపల పనిచేసే ఉద్యోగుల వేతనాలు 1.5 శాతం నుంచి 6 శాతానికి పెరిగినట్లు TCS company తెలిపింది. ఆయా దేశాల్లోని మార్కెట్ ట్రెండ్స్కు అనుగుణంగా అక్కడ పనిచేస్తున్న తమ ఉద్యోగుల పారితోషికంలో పెంపు ఉంటుందని కంపెనీ వెల్లడించింది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *