Tata Motors:మార్కెట్లో మారుతీని దాటేసిన టాటా మోటార్స్!

TATA MOTORS : ఆటోమొబైల్ తయారీదారు టాటా మోటార్స్ మార్కెట్ విలువ పరంగా దేశంలో అతిపెద్ద ఆటోమొబైల్ కంపెనీగా అవతరించింది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

భారత ఆటోమొబైల్ తయారీ దిగ్గజం టాటా మోటార్స్ సరికొత్త ఘనత సాధించింది. మార్కెట్ విలువ పరంగా దేశంలోనే అతిపెద్ద ఆటోమొబైల్ కంపెనీగా అవతరించింది. డివిఆర్ షేర్లు, మార్కెట్ విలువ పరంగా కంపెనీ మారుతీ సుజుకీని అధిగమించింది. రూ.2,85,515.64 కోట్ల మార్కెట్ విలువతో టాటా మోటార్స్, రూ.29,119.42 కోట్ల మార్కెట్ విలువతో టాటా మోటార్స్ లిమిటెడ్ డీవీఆర్ మొత్తం మార్కెట్ విలువ రూ.3,14,635.06 కోట్లతో ఆటోమొబైల్ కంపెనీల్లో మొదటి స్థానంలో నిలిచాయి. ప్రస్తుతం మారుతీ సుజుకీ రూ.3,13,058.50 కోట్లతో రెండో స్థానానికి పరిమితమైంది.

మార్కెట్ ముగిసే సమయానికి టాటా మోటార్స్ షేర్ 2.19 శాతం పెరిగి రూ.859.25 వద్ద స్థిరపడింది. టాటా మోటార్స్ లిమిటెడ్ DVR షేర్లు 1.63 శాతం పెరిగి రూ. 572.65కు చేరుకుంది. ఇంట్రాడేలో రూ.886.30 వద్ద 52 వారాల గరిష్టాన్ని తాకింది. కాగా, మారుతీ సుజుకీ షేర్లు 0.36 శాతం నష్టపోయి రూ.9,957.25 వద్ద ముగిశాయి.

Related News