‘తండేల్’ సినిమాతో అక్కినేని హీరో నాగ చైతన్య బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. చైతన్య కెరీర్ లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది..
అక్కినేని చరిత్రను తిరగరాసిన ఈ సినిమాను చందూ మొండేటి దర్శకత్వం వహించారు. ఇందులో నేచురల్ బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్ గా నటించింది. సినిమా విడుదలకు ముందే పాటలతో హ్యాట్రిక్ హిట్ అందుకున్న ఈ సినిమా.. ఫిబ్రవరి 7న వాలెంటైన్స్ డే సందర్భంగా గ్రాండ్ గా విడుదలై.. ఇప్పటికీ థియేటర్లలో సందడి చేస్తోంది. బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు కూడా రాబడుతోంది. ఈ సినిమాతో నాగ చైతన్య గ్రాఫ్ పెరిగిందని చెప్పవచ్చు. దీంతో నాగ చైతన్య తదుపరి ఎలాంటి సినిమాలు చేస్తాడనే ఆసక్తి ప్రేక్షకుల్లో పెరిగింది. ఈ నేపథ్యంలో చైతు సినిమాలకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన వార్త వైరల్ అవుతోంది.
వాటిలో ఒకటి ఇప్పటికే కన్ఫర్మ్ అయింది. ‘తండేల్’ సక్సెస్ మీట్ లో నాగ చైతన్య, చందూ మొండేటి కాంబో మరోసారి పునరావృతం అవుతుందని అధికారిక ప్రకటన వెలువడింది. త్వరలో ఒక గొప్ప చారిత్రక సినిమా తీయబోతున్నట్లు ప్రకటించారు.. అక్కినేని నాగేశ్వరరావు నిర్మించిన తెనాలి రామకృష్ణ సినిమాను ప్రేక్షకులకు అర్థమయ్యేలా సినిమాగా తీస్తామని ప్రకటించారు. వీటితో పాటు.. ‘విరూపాక్ష’ దర్శకుడు కార్తీక్ వర్మ దండుతో మిస్టరీ థ్రిల్లర్ సినిమా.. ‘బాహుబలి’, ‘బాహుబలి-2’ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలను అందించిన ఆర్కా మీడియా వర్క్స్ తో కూడా ఓ సినిమా తీయబోతున్నట్లు టాక్ ఉంది. హారర్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమా దర్శకుడు ఎవరో ఇంకా తెలియాల్సి ఉంది.