2025 షాంఘై మోటార్ షోలో హోండా మరోసారి తన టెక్నాలజీ పవర్ చూపించింది. చైనీస్ మార్కెట్ కోసం ప్రత్యేకంగా తయారు చేసిన రెండు కొత్త ఎలక్ట్రిక్ గ్రాండ్ టూరర్ మోడళ్లను హోండా అట్టహాసంగా ఆవిష్కరించింది.
GAC, డాంగ్‌ఫెంగ్ కంపెనీలతో కలిసి తయారు చేసిన ఈ కార్లు ‘యే సిరీస్’లో భాగంగా ఉన్నాయి. డిజైన్ పరంగా చాలా దగ్గరగా ఉన్నా, వేరే వేరే స్టైలింగ్ టచ్‌లు వాటిని ప్రత్యేకంగా నిలబెడుతున్నాయి.
6 స్క్రీన్లతో ఫ్యూచరిస్టిక్ ఇంటీరియర్
ఈ కార్లలో ఇచ్చిన ఇంటీరియర్ చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. మొత్తం ఆరు స్క్రీన్ల డిజైన్ ఉండటమే కాదు, డ్రైవర్, ప్యాసింజర్‌కి ప్రత్యేకమైన డిస్‌ప్లేలు, సైడ్ మిర్రర్‌ల స్థానంలో స్క్రీన్‌లు ఉన్నాయి. మిగతా బటన్‌లు చాలా తక్కువగా ఉండగా, స్టీరింగ్‌పై మాత్రమే కొన్ని ఫిజికల్ కంట్రోల్స్ ఉంటాయి. ఇది పూర్తిగా డిజిటల్ డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్‌ని ఇస్తుంది. ఒక రేసింగ్ కార్‌లో ఉన్నట్టు ఫీల్ కలుగుతుంది.
పవర్‌ట్రైన్ వివరాలు రహస్యమే కానీ..
ఈ మోడళ్ల పవర్‌ట్రైన్ వివరాలను హోండా ఇంకా ప్రకటించలేదు. అయితే వీటిలో e:N ఆర్కిటెక్చర్ W ప్లాట్‌ఫారాన్ని వాడే అవకాశముంది. ఇది రియర్ వీల్ డ్రైవ్, ఆల్ వీల్ డ్రైవ్ కాన్ఫిగరేషన్‌లకు సరిపోతుంది. 469 bhp పవర్, 400 మైళ్ల రేంజ్ వంటివి అందించగల సామర్థ్యం ఈ ప్లాట్‌ఫారంలో ఉంది.
విడుదలైన రెండు మోడల్స్ – GAC Honda GT & Dongfeng Honda GT
ఈ రెండు మోడల్స్ కూడా చైనా మార్కెట్‌కి ప్రత్యేకంగా రూపొందించబడ్డాయి. “లో & వైడ్” డిజైన్‌తో ఇవి ఫ్యూచర్ కార్ల లుక్ ఇస్తున్నాయి. డ్రైవర్ కోసం ఫోకస్ చేసిన కాక్‌పిట్, ప్యాసింజర్‌కి పెద్ద డిస్‌ప్లే స్క్రీన్‌తో ప్రత్యేకమైన ముబిలిటీ అనుభూతిని ఇవ్వడమే లక్ష్యంగా ఉన్నాయి.
AI, బాటరీ టెక్నాలజీలో హోండా పథకం స్పష్టంగా ఉంది
మొమెంటా కంపెనీతో కలిసి హోండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత డ్రైవింగ్ సిస్టమ్స్‌ను అభివృద్ధి చేస్తోంది. దీని ద్వారా కార్‌ని ఆటోమేటిగ్గా లక్ష్య స్థలానికి తీసుకెళ్లే విధంగా తయారు చేస్తారు. అదే సమయంలో DeepSeek అనే కంపెనీ నుంచి కూడా AI టెక్నాలజీ తీసుకుంటూ, ప్రయాణికులకు సౌకర్యవంతమైన అనుభవాన్ని అందించేందుకు కృషి చేస్తోంది.
CATL తో కలిసి కొత్త బెటరీలు, ప్లాట్‌ఫారమ్ అభివృద్ధి
CATL అనే ప్రముఖ బ్యాటరీ కంపెనీతో హోండా కలిసి, కొత్త LFP బ్యాటరీలపై పనిచేస్తోంది. ఇవి థర్డ్ సెట్ యే సిరీస్ మోడళ్ల కోసం వాడతారు. బ్యాటరీలను కార్ బాడీలోనే ఇంటిగ్రేట్ చేసే కొత్త ప్లాట్‌ఫారమ్ కూడా డిజైన్ చేస్తున్నారు. ఈ చర్యలన్నీ 2050 నాటికి కార్బన్ న్యూట్రాలిటీ లక్ష్యాన్ని చేరుకోవడంలో భాగమే.
హోండా దూసుకెళ్తోంది…
ఈ కొత్త EV మోడల్స్‌తో Honda తన టెక్నాలజీ, డిజైన్, ముబిలిటీ దిశగా ఎలాంటి విజన్ పెట్టుకుందో స్పష్టమవుతోంది. రాబోయే రోజుల్లో చైనాలోనే కాకుండా, గ్లోబల్‌గా కూడా ఇలాంటి ఫ్యూచరిస్టిక్, హై-టెక్ కార్లు మార్కెట్లోకి వస్తే ఆశ్చర్యం లేదు. ఇప్పుడు ఇదే ట్రెండ్! ఫ్యూచర్ కార్లు అంటే ఇలా ఉంటాయి!