సుప్రీమ్ కోర్ట్ : పెళ్లిపై సుప్రీంకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. భార్యాభర్తల మధ్య అనుబంధం పరస్పర నమ్మకంపై ఆధారపడి ఉంటుందని పేర్కొంది. మద్రాసు హైకోర్టు మధురై బెంచ్ తనకు విడాకులు మంజూరు చేయడాన్ని సవాల్ చేస్తూ ఓ మహిళ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.
ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ దంపతులు దాదాపు 20 ఏళ్లుగా విడివిడిగా జీవిస్తున్నారు. గతంలో మద్రాసు హైకోర్టు మధురై బెంచ్ దంపతులకు విడాకులు మంజూరు చేస్తూ తీర్పునిచ్చింది. దీన్ని సవాల్ చేస్తూ ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తాజాగా ఈ కేసును విచారించిన అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు ఆదేశాలను సమర్థించింది. ‘
‘వివాహ బంధం పరస్పర విశ్వాసం, సాంగత్యం మరియు భాగస్వామ్య అనుభవాల పునాదులపై నిర్మించబడింది. ఈ విషయంలో ఇవేవీ లేకుండా చాలా కాలంగా విడివిడిగా జీవిస్తున్నారు. వీరిద్దరి మధ్య ఉన్న విరోధం నేపథ్యంలో “మళ్లీ బంధం పుంజుకునే అవకాశం లేదని స్పష్టమవుతోంది’’ అని పేర్కొంది.