ఒకవైపు వర్షాలు.. మరోవైపు ఎండ.. కొంచెం ఇష్టం.. కొంచెం కష్టం.. గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం భిన్నంగా మారింది. పగటిపూట ఎండలు దంచి కొడుతున్నాయి.. సాయంత్రం వేళల్లో వడగళ్ల వానలు కురుస్తున్నాయి.. ఈ క్రమంలో వాతావరణ శాఖ కీలక ప్రకటన విడుదల చేసింది.. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో భిన్నమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకోండి..!!
ఇది తెలంగాణ వాతావరణ నివేదిక..
తెలంగాణలో వాతావరణ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. మధ్యాహ్నం వరకు ఎండలు తీవ్రంగా ఉన్నాయి, సాయంత్రం వాతావరణం చల్లబడి వర్షం పడుతోంది. నిన్న నిజామాబాద్ జిల్లాలో అత్యధికంగా 41.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మధ్యాహ్నం నుంచి మహబూబాబాద్, హనుమకొండ, వరంగల్, జనగాం, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో గాలి, వర్షం బీభత్సం సృష్టించాయి. ఖమ్మంలో వడగళ్ల వాన కారణంగా మామిడి తోటలు నేలకూలాయి. మరోవైపు, దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాబోయే 48 గంటల్లో రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.
Related News
ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే 3 రోజులు వర్షాలు
ఇప్పుడు, AP కి వస్తున్నాం.. దక్షిణ-మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. అల్పపీడనం ప్రభావంతో, AP లో రాబోయే 3 రోజులు వర్షాలు కురుస్తాయి. అలాగే, రాబోయే నాలుగు రోజులు గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుండి 3 డిగ్రీలు పెరిగే అవకాశం ఉంది.. ఆ తర్వాత, స్వల్పంగా తగ్గే అవకాశం ఉంది. మరోవైపు, రాష్ట్రంలో మిశ్రమ వాతావరణం ఉంటుందని, కొన్ని చోట్ల వర్షాలు, కొన్ని చోట్ల ఎండలు ఉంటాయని అధికారులు సూచించారు.. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.