వేసవి కాలం మొదలైంది. ఎండలు మండిపోతున్నాయి. అయితే.. ఈ వేసవిలో పాత రికార్డులు తిరగరాయబడవచ్చని IMD అంచనా వేస్తోంది. మార్చి 15 నుండి తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో.. కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉంది.. బయటకు వెళ్లేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.
తెలంగాణలో ఇప్పటికే రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఫిబ్రవరిలోనే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. దీంతో ఉదయం 11 గంటలకు ముందే రాష్ట్రవ్యాప్తంగా వేడిగాలులు ప్రారంభమయ్యాయి. గత వారం రోజులుగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. మహబూబ్ నగర్, ఆదిలాబాద్, రామగుండ, ఖమ్మం జిల్లాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 డిగ్రీలు పెరిగాయి. గాలిలో తేమ చాలా తక్కువగా ఉంది.
ఫిబ్రవరిలో ఎండలు ఇలాగే మండిపోతుంటే, మే నెల వచ్చేసరికి పరిస్థితి మరింత దారుణంగా ఉండవచ్చనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఏడాది జనవరిలో పగలు, రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదయ్యాయి. ఫిబ్రవరిలో గత 13 రోజుల్లో చాలా చోట్ల రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవగా, ఈ 13 రోజుల్లో 11 రోజుల్లో తెలంగాణలో దేశంలోనే అత్యధిక పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. బయటకు వెళ్లేటప్పుడు జాగ్రత్తలు తప్పనిసరి అని వాతావరణ శాఖ సూచించింది.
Related News
తెలంగాణలోని మహబూబ్ నగర్, భద్రాచలం, ఖమ్మం, హనుమకొండ, హైదరాబాద్ జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి..
- మహబూబ్ నగర్.. 37.5
- భద్రాచలం..36.8
- ఖమ్మం..36.6
- మెదక్..35.6
- హైదరాబాద్..35.2
- హనుమకొండ..35
- ఆదిలాబాద్..34
- రామగుండం. 33.8
- నిజామాబాద్..33.5
- నల్లగొండ.. 33.2
మహబూబ్‌నగర్‌లో శనివారం గరిష్ట ఉష్ణోగ్రత 36.7 డిగ్రీల సెల్సియస్, నల్గొండలో కనిష్ట ఉష్ణోగ్రత 32 డిగ్రీల సెల్సియస్‌గా ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
ఆంధ్రప్రదేశ్‌లో కూడా వేడి మండిపోతోంది. రాబోయే మూడు రోజులు రాష్ట్రంలో వేడి తీవ్రత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుండి 5 డిగ్రీల సెల్సియస్ ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని అంచనా.