Summer Drinks: వేసవిలో ఆరోగ్యం తో పాటు అందం కూడా మీ సొంతం .. ఈ డ్రింక్స్ ట్రై చేయండి

మండే ఎండల్లో చల్లని పానీయాలు తాగడం వల్ల సేద తీరుతుంది. కానీ, కూల్ డ్రింక్స్ వంటి రసాయనయుత పానీయాలు తాగితే తాత్కాలికంగా దాహం తీరినా, తర్వాత ఆరోగ్య సమస్యలను తెచ్చిపెడతాయి. అలా కాకుండా, సహజమైన మరియు పోషకాలతో కూడిన ఈ డ్రింక్స్ తాగండి. ఇవి దాహాన్ని తీర్చడమే కాకుండా, ఎండలో వాడిన మీ చర్మానికి ప్రత్యేక పోషణను ఇస్తాయి.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

వేసవి వచ్చేసింది. ఉదయం పది గంటలకే మండే ఎండలు బాధిస్తున్నాయి. ఈ వేడిని తట్టుకోవడానికి చాలామంది కూల్ డ్రింక్స్ తాగుతారు. కానీ, ఈ రసాయన పానీయాలు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. బదులుగా, ఈ క్రింది సహజ పానీయాలు తాగితే శరీరం చల్లగా ఉండడమే కాకుండా, చర్మం కూడా ప్రకాశవంతంగా మారుతుంది.

1. నారింజ & అల్లం రసం

నారింజలో ఉన్న విటమిన్-సి చర్మాన్ని UV కిరణాల నుండి రక్షిస్తుంది. అల్లంలోని ఆంటీ-ఇన్ఫ్లమేటరీ గుణాలు రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. ఇది చర్మాన్ని ఆరోగ్యంగా మరియు కాంతివంతంగా ఉంచుతుంది.

Related News

2. పుచ్చకాయ & పుదీనా రసం

పుచ్చకాయలో విటమిన్లు-ఎ, సి మరియు లైకోపీన్ ఉంటాయి. ఇది శరీరాన్ని హైడ్రేట్ చేయడమే కాకుండా, చర్మాన్ని కూడా రక్షిస్తుంది. పుదీనాలోని యాంటీ-ఇన్ఫ్లమేటరీ లక్షణాలు చర్మం మీది మొటిమలు, మంటలను తగ్గిస్తాయి.

3. పైనాపిల్ & అల్లం రసం

పైనాపిల్‌లో ఉన్న విటమిన్-సి కొల్లాజెన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. దీనిలోని బ్రోమెలైన్ ఎంజైమ్ చర్మాన్ని మృదువుగా మరియు ప్రకాశవంతంగా చేస్తుంది. అల్లం రసం చర్మం యొక్క కాంతిని పెంచుతుంది.

4. నిమ్మ & పుదీనా రసం

నిమ్మకాయలో ఉన్న విటమిన్-సి చర్మాన్ని డిటాక్సిఫై చేస్తుంది. పుదీనా మొటిమలను తగ్గించి, చర్మాన్ని ప్రకాశవంతంగా మారుస్తుంది.

కాబట్టి, ఈ వేసవిలో రసాయన డ్రింక్స్కు బదులు సహజ పండ్ల రసాలు తాగి, ఆరోగ్యంతో పాటు అందాన్ని కాపాడుకోండి!