CM జగన్ పై రాయితో దాడి.. కంటి పైన గాయం.. వైరల్ వీడియో

విజయవాడలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సుయాత్రలో అపశృతి చోటుచేసుకుంది. కొందరు దుండగులు ముఖ్యమంత్రిపై రాళ్లు రువ్వడంతో ఆయన ఎడమ కన్నుకు తీవ్రగాయాలయ్యాయి. విజయవాడ సింగ్‌నగర్‌ దాబా కోట్ల సెంటర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. బస్సు నుంచి బయటకు వచ్చి ప్రజలకు అభివాదం చేస్తున్న సమయంలో ప్రణాళికాబద్ధంగా రాళ్లదాడి జరిగినట్లు సమాచారం. క్యాట్‌బాల్‌పై రాయి విసరడంతో ఆ రాయి వేగంగా వచ్చి జగన్ ఎడమ కనుబొమ్మకు తగిలింది. దీంతో కంటి దగ్గర వాపు వచ్చింది. జగన్‌కు వైద్యులు ప్రాథమిక చికిత్స అందించారు. చికిత్స అనంతరం బస్సు ప్రయాణం యథావిధిగా కొనసాగుతోంది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

ఈ ఘటనలో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌కు కూడా గాయాలయ్యాయి. ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారు. జగన్ పై దాడి జరిగిన ప్రాంతంలో ఓ వైపు పాఠశాల, మరోవైపు రెండంతస్తుల భవనాలు ఉన్నాయి. మరోవైపు ఈ దాడిలో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ప్రజాభిమానాన్ని భరించలేకనే సీఎం జగన్‌పై టీడీపీ వర్గాలు దాడికి పాల్పడ్డాయని విజయవాడ వైఎస్సార్సీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

Related News