Stock Market: నష్టాల్లోకి జారిన స్టాక్ మార్కెట్లు..

దేశీయ ఈక్విటీ మార్కెట్లలో రికార్డు నష్టాలు కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుండి ప్రతికూల సంకేతాలతో పాటు, కీలక దేశీయ కంపెనీల షేర్లలో అమ్మకాలు కొనసాగడంతో మంగళవారం ట్రేడింగ్‌లో వరుసగా తొమ్మిదవ రోజు కూడా సూచీలు బలహీనపడ్డాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా, కెనడా, మెక్సికోలపై సుంకాలను గతంలో ప్రకటించడం వల్ల ప్రపంచ మార్కెట్లలో పెట్టుబడిదారుల సెంటిమెంట్ దెబ్బతింది. అదే సమయంలో, చైనా కూడా అమెరికన్ ఉత్పత్తులపై ప్రతీకార పన్నులు విధించడంతో అంతర్జాతీయంగా వాణిజ్య యుద్ధం భయాలు పెరిగాయి.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

అదనంగా, విదేశీ పెట్టుబడిదారులు మన మార్కెట్ల నుండి నిధులను ఉపసంహరించుకోవడం కొనసాగించారు. కీలకమైన ఐటీ కంపెనీలైన రిలయన్స్, ఎయిర్‌టెల్, ఇన్ఫోసిస్ షేర్లలో అమ్మకాలు నష్టాలకు కారణమయ్యాయి. విదేశీ పెట్టుబడిదారులు భారతీయ ఈక్విటీల నుండి నిధులను ఉపసంహరించుకోవడంతో మన స్టాక్ మార్కెట్లు చారిత్రాత్మక నష్టాల్లోకి పడిపోయాయి. ఫలితంగా నిఫ్టీ 50 సూచిక తొమ్మిది నెలల కనిష్ట స్థాయికి పడిపోయింది. గత సంవత్సరం సెప్టెంబర్‌లో నమోదైన గరిష్టాల నుండి ఇది 16 శాతం పడిపోయిందని మార్కెట్ నిపుణులు తెలిపారు. ఆర్థిక వృద్ధి మందగించడం, స్టాక్‌ల అధిక విలువలపై ఆందోళనల కారణంగా గ్లోబల్ ఫండ్లు ఈ సంవత్సరం రూ. 1.22 లక్షల కోట్లకు పైగా ఉపసంహరించుకున్నాయి. ఫలితంగా సెన్సెక్స్ 96.01 పాయింట్లు తగ్గి 72,989 వద్ద ముగిసింది. నిఫ్టీ ముగింపు సమయానికి 36.65 పాయింట్లు కోల్పోయి 22,082 వద్ద ముగిసింది. అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ రూ. 87.16 వద్ద ట్రేడవుతోంది.